జగ్గన్న గంటం
అతడు వేద వేదాంగ పారంగతుడు. సకలశాస్త్ర విద్యావేత్త. నిరుపేద. పేరు జగ్గన్న. ఇంటిపేరు కడలివారు. కృష్ణానదీతీర శాలిభూములలో రెండు నివర్తాల నేల అతని పెద్ద కుటుంబానికి ఏ మాత్రం రాబడి నివ్వగలదు? జగ్గన్న తండ్రి రామన్న మంత్రికి ఆరుగురు ఆడపిల్లలు, ముగ్గురు మొగపిల్లవాండ్లు. ముగ్గురు ఆడపిల్లలకు పెళ్ళిళ్లు చేసినారు. వారు అత్తవారి ఇళ్ళల్లో కాపురం చేస్తున్నారు. ఒక్కొక్క పెళ్ళికి ముప్పది నలువది కృష్ణరాయ వరహాల వరకు ఖర్చు అయినది. ఆ వరహాల రాబడికి ఒక్కొక్క నివర్తమే అమ్ముడు పోయింది.
రామన్న మంత్రి అతి అభిమాని. కూటికి జొన్నలు లేకపోయినా కుండ చల్లగా వుండవలసిందే. కుటుంబం యావత్తూ అలా యెన్నిరోజులు పస్తుందో! కమ్మనాటి ఆరువేల బ్రాహ్మణుడు. కొండపల్లి రెడ్డి ప్రభువుల రాజ్యం పాల సముద్రపు కెరటాలల్లా పరిపాలింపజేసిన జక్కన మంత్రి ముని మనుమడు.
కొండపల్లి రెడ్డి రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు వడిసి బట్టి లోబర్చుకొన్నప్పుడు జక్కనమంత్రి రిక్తహస్తాలతో
101