పుట:Bhagira Loya.djvu/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

స్వగ్రామమైన కడలీపుర క్షేత్రానికి విచ్చేసి తన మెడలోని హారాల నమ్ముకొని నూరు నివర్తములు భూమి కొని వ్యవసాయ దారుడయ్యాడు. భారతీయుడికి వాడి కత్తి అయినా దొరుకుతుంది. లేకపోతే నాగలి మేడి తోకైనా దొరుకుతుంది.

మూడు తరాల్లో నూరు నివర్తాల భూమి ఆరింటికి దిగింది. రాజభోగం పోయినా రాజసం మిగిలింది.

2

కడలి జక్కన్న చదువుల కడలి. అతని వ్రాత ముత్యాల పోత. స్నానాది అనుష్ఠానాలు నిర్వర్తించుకుని ఉత్తరాన నాగేశ్వరస్వామి భక్తులు మోయించే గంటలతో శ్రుతికల్పి వాడి మొనవాలు గంటము చేత బూని ఏ భారతమో, భాస్కర రామాయణమో, శ్రీనాధ కాశీఖండమో, పెద్దనార్యుని మనుచరిత్రమో చక్కగా సమకూర్చిన తాళపత్రాల మీద లిఖిస్తూ వుంటే అర్ధయామానికి ఆశ్వాసము పూర్తి అయ్యేది. అతని బంధువులలో ఒక కుటుంబానికి పూర్వీకుడు అయిన పేరంరాజు జక్కనకవి సిద్థయామాత్యుని గురించి చెప్పినట్లు మన జక్కన్న గంటము వ్రాతలో సవ్యసాచి. రెండు చేతులా ముత్యాల మాలలు మహావేగంతో వ్రాయగలడు.

చిన్నతనాన్నించి అలవడిన ఈ విచిత్ర కౌశల్యమువల్ల జక్కన్న అప్పుడప్పుడు తండ్రిగారి పాదాలకడ పది పదిహేను

102