పుట:Bhaarata arthashaastramu (1958).pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. అలంకారవస్తువుల నొకవిశేషము. సర్వసామాన్యముగా నందఱు దొడుగునదియాయెనేని యది గొప్పగానున్నను నట్లెన్నబడదు. అసాధారణత మన్ననకు జన్మహేతువు. ఉదా. సొగసు జుక్కల చీరను యజమానురాలు ధరించి కులుకుచుండుటజూచి యిరుగు పొరుగింటి భాగ్యశాలినులు ఆతీరు చీరలె దాల్చిరేని "ఇది సామాన్యమాయెను. ఇందులో గుణములేదు" అని మొదటియమ్మ చింతించును. ఆ చీర యింకను వ్యాప్తికివచ్చి పనికత్తెలచేత సయితము ధరింపబడునదియైన దాని గౌరవము తుట్రాగా నశించును గొప్పయిండ్ల యాడంగులు దానిని దూరముగ బాఱవైతురు. సొగసుల గతి యెన్నడు నింతే. మిక్కిలి వ్యాప్తమయిన దళుకుమాసినవగును. కావున గిరాకి హెచ్చుచుబోయి తటాలున మాయజెందును.

5. ఆవశ్యకములసైతము రాశితగ్గినదే వెలహెచ్చుట యప్రకృతము. ఎట్లన, అమ్మకమునకువచ్చు వస్త్రములు కొఱతవడినచో వెలహెచ్చుననుట దెలిసి యనేకులు ప్రాతబట్టలను త్వరలో విసర్జింపకయు, వివాహాదుల సెలవు మట్టుసేసియు మితముగగొందురు. గిరాకి మితమగును. వెలలు పూర్ణవృద్ధికిరావు. కొంతకాలమైనపిదప ప్రాతపేలిక లెందునకుం బనికిరానివై నూతన పరిధానము లందీయుట యనివార్య కార్యమైన వెల లింకను విరివిగాంచు.

ఆర్థికన్యాయముల స్వభావము

ఈ యుపాధులున్నందున గిరాకి, ధరలు, రాశి. వీనికింగల పరస్పరసామ్యము రద్దుచేయబడియెనని యనుకొనబోయెదరు. వేడివేడినీళ్ళలో చల్లనీళ్ళుపోసిన శీతోష్ణములు మిశ్రములై దానికిని దీనికిని మధ్యగతియైన వెచ్చనగానేర్పడును. వేడియు చావలేదు. శీతమును జావలేదు. రెండును మిళితములై ఫలమైన గోర్వెచ్చన యందంతర్భావము సెందినవి. అట్లే సర్వన్యాయములును వాని బాధించు నితరన్యాయములును. ఇవి యితరేతరచ్ఛేదనక్రియకు పూను