పుట:Bhaarata arthashaastramu (1958).pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజులయు బూజారులయు గ్రౌర్యములు, నిరుత్సాహత, అభ్యాసము వలన గలుగు మందిమగుణము, ఇత్యాదులనేకములు పిఱిగిని జాతి బంధముల నేర్పఱచినవని యాధునికుల యభిప్రాయము. మిశ్రత యేమాత్రమునులేక శుద్ధముగనుండు కారణకార్యంబులు సంఘ సంప్రదాయములలో మృగ్యంబులు.

కాలమాహాత్మ్యము విశదీకరించు నంశంబు లెవ్వియనిన:-

1. గుఱ్ఱములు గుఱ్ఱపుబండ్లును మునుపటికన్న నిపుడు వెల పొడుగుగానున్నను గిరాకి తగ్గినదా? మనన్యాయం బబాధితంబై యున్న తగ్గియుండును. వీనివెల హెచ్చుసరికి చెన్నపురిలో ధన సంపదయు విలసిల్లినందున గిరాకి లాఘవంబులేదు. కావున హేతువు సిద్ధినొందుటకు వలసిన కాలములోన నైశ్వర్యాభివృద్ధియు నైనయెడల కార్యంబు కలుగదు. ఇదియొక వ్యతిరేక కారణము.

2. దేశములో రాజశాసన సిద్ధములై పరగునాణెములును దక్కినవస్తువులబోలె రాశికొలది మూల్యభేదముం గాంచును. ఉదా. రూపాయలు పదియేండ్లక్రిందట మిక్కిలియు వ్రాలినవిగా నుండినందున సవరనువెల 18 రూపాయలకన్న నెక్కువకు బోయెను. ఇపుడు రూపాయలరాశి తగ్గినందున వానివిలువ మఱల హెచ్చినది. సవరనుల 15 రూపాయలకు గొనవచ్చుననుటయ దీనికి దార్కాణ. ఈ విషయముయొక్క యతిదేశ మేమనగా:-

వస్తువుల మూల్యము ఘనతరమగు నవసరంబున, నాణెముల మూల్యము సన్నబడునేని, ధనము ఎక్కువ పట్టినను ఇచ్చుటలో నష్టములేదు. అట్లయిన గిరాకి తఱుగనేరదు.

3. ఒకవస్తువు ప్రియమాయెనని దానివెలల నెగబెట్ట నుత్పాదకు లుద్యుక్తులై యున్నతఱిని ఆ ప్రయోజనమును సమకూర్చు వేఱొకవస్తువు కనిపెట్టబడెనేని వెలలు హెచ్చించుట బుద్ధిలేనిపని. ఏలన, జనులీ నూతనవస్తువునె వరింతురు.