పుట:Bhaarata arthashaastramu (1958).pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

కాలప్రభావము

పైన వివరించిన సంయోగములన్నియు కృతయుగములోని మానసపుత్రులవలె తత్క్షణమాత్రమున బుట్టునవికావు. వీనికి గాలము గావలసియున్నది. ఎట్లన గిరాకి హెచ్చినదే వెలలు జాగులేక హెచ్చవు. ఈ గిరాకి హెచ్చుటకతన గొన్నిసరకులు వేగిరమున సెలవగుటచే నమ్మువారికి మర్మము తెలిసి వెలలు పైకి దెత్తురు. వస్తువులు స్నిగ్ధములైనను నట్లే గిరాకియొక్క పోడిమి హెచ్చుటకు కాలము పట్టును.

ఒక్క కాలముపట్టుటయకాదు. ఈ కాలము తుదముట్టులోన నితరములైన మాఱుపాటలేవైనను సంభవించి గిరాకిని ధరలను గ్రొత్తత్రోవల నీడ్చుకొనిపోయినను బోవచ్చును. భారత అర్థశాస్త్రమున నిరూపింపబడిన యావన్న్యాయంబులకును కాలంబు బాధాకరంబు, ఎట్లన:-

1. హేతువునుండి కార్యము జనించుటకు కొంచెమో ఘనమో కాలమావశ్యకము

2. ఈ కాలము పూర్తిగ నబ్బులోన నితర హేతువు లుద్భవిల్లి సమ్మేళనముజెంది ఫలసంకరము సంభవింపజేయును. సంఘములోని సమస్తప్రవర్తనలును అనేక హేతువుల కుద్భవించిన సంకరంబులనుట ప్రధానతరమైన తత్త్వము:- జాతిభేదములంగూర్చి విచారింతము. వీనికి నాధారకారణమెయ్యది? పౌరాణికులలెక్క యెల్లి శెట్టిలెక్కకు దోడుపోయినది. అన్నిప్రశ్నలకు నొకయుత్తరమే! ఏమి? బ్రహ్మ సృష్టియని, సంఘశాస్త్రజ్ఞుల మతమింత సులభముగాదు. వృత్తిభేదములు, అరాజకము, యానదారిద్ర్యము, విద్యాగంధవిహీనత,