పుట:Bhaarata arthashaastramu (1958).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చల్లగా ఉదక మండలము చేయవలయు ననువారేమి? ఇట్లనేక విధముల బోగమునకువచ్చు రాశి యధికమగును. కావున నీప్రయోజనములలో జనులకు నీటియెడ విక్షేపసంక్షేపంబుల కాశ్రయంబైన యభిమతం బున్నదనుట నిశ్చయంబు.

కావున మొత్తముమీద బహుప్రయోజనానుకూలములైన వస్తువులు క్రిందుమీదులుగల గిరాకికిం బదిలమైన స్థానములు. ఏలన గిరాకి యొకదిక్కున పెఱుగుట విఱుగుట లేక స్థిరతగాంచినను తక్కినదిక్కుల ముందు వెన్కల బోవునదిగా నుండవచ్చును. ఏక కాలంబుననే యన్నిఫలంబుల యెడలను నిర్వికల్ప జడత్వంబును వహించుననుట సంభావింపబోలిన యూహయైనను సామాన్యముగ సంభవించునదిగాదు.