పుట:Bhaarata arthashaastramu (1958).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధరలెక్కువయైనను ఇతరవస్తువుల వ్రయము దగ్గించియైన నుప్పు కొనితీరవలయును. కావున వెల హెచ్చుటచే గిరాకి యంతగా దగ్గదు. ఇక ధరలు మిక్కిలిగా తగ్గించినచో క్రొత్త క్రొత్త యూరుగాయలు వేసికొందమని యెక్కువ సెలవులు గొన్నిపెట్టుకున్నను మొత్తము మీద వాడుకరీతికన్న నెక్కువగా బ్రోగుసేయబోరు. కావున గిరాకిరాశి తఱుచు హెచ్చుటయులేదు. కావున నుప్పునందలి యభిమతి పరబ్రహ్మాసక్తివలె నియమించు నిశ్చలతత్త్వమునకుం జేరినది. ఇందు చంచలత మిక్కిలి విస్తరించునది గాదు.

2. అలంకార యోగ్యములైన చీనిచీనాంబరాభరణాదులు, వీని లక్షణములురెండు. (అ) కొందఱికి నివియెంతయున్నను దనివి తీఱదు. (ఆ) జీవాధారములు కావుకావున దీసియే తీరవలయునని విధిలేదు.

ఈ లక్షణములవలని ఫలములు:- రాసులాతతములై ధరల గుదియించిన వీనియందలి యాదరము మిక్కిలి వ్యాపించును. గిరాకి హెచ్చి రాసులన్నియు నాక్రమించినను నాక్రమింపవచ్చును.

రాసులు క్షీణించి వెలలొకవేళ వికసించెనేని తీయవలసిన విధిలేదు గావున గిరాకి ముడుచుకొని పోవును. కావున నీవస్తువులయెడ జనులయపేక్ష రబ్బరు త్రాడువలె సాగునదియు ముడుగునదియు నైయుండును.

3. మఱికొన్ని వస్తువులు కొందఱికి నావశ్యకములుగను గొందఱికి ననిత్యభోగ్యములుగాను నుంటజేసి పక్షద్వయ ప్రకారము నిర్వికల్ప, సవికల్పాదరణయుతములై యుండును. ఉదా. నెయ్యి. పప్పు.

హతదారిద్రులైనవారికి నియ్యవి ప్రతిదినమును బుష్కలముగ నుండినగాని భోజనము హితముగాదు. వెలలేదిక్కుదిరిగిననుసరే. నిర్ణయప్రకారము కొనితీరుదురు. వీనివలన గిరాకి వ్యాకోచసంకోచంబుల పాలుగాదు.