పుట:Bhaarata arthashaastramu (1958).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏడవ ప్రకరణము

వాంఛలయొక్క అనగా గిరాకియొక్క హెచ్చుతగ్గుజాడలు

రాశివిక్షేపించిన వాంఛలు సంక్షేపించుటయు రాశిసంక్షేపించిన వాంఛలు విక్షేపించుటయు మొత్తముమీద ననుభవమునగానబడు లక్షణములెయైనను ఈ యారోహావరోహములు ద్రుతగమనములా, మందగమునములా యనుట యింకను విచారణీయము, మమత తటాలునవ్రాలునా? మెల్లమెల్లగ క్రిందికిదిగునా? ఉన్నట్లుండి విజృంభించునా? క్రమక్రమమున నెగయునా? ఈ ప్రశ్న లెంతయు దొడ్డవి. వీనినే యింకను స్పష్టమగుతీరున వేయనగును:-

రాశియెక్కువయగుడు అంత్యోపయుక్తత తక్కువయగును. అనగా నారాశినంతయు నమ్మవలయునన్న వెలల దగ్గించవలసి వచ్చును. ఏలయన ఉపయుక్తతయొక్క తీవ్రము తగ్గెనేని మునుపటి వెలలకన్న దక్కువమాత్రమే కొనువారియ్య నొడంబడుదురు. వెలలు తగ్గించిరనుకొందము. ఏమాత్రము తగ్గింపవలయుననుట మొదటి ప్రశ్న. వెలలు తగ్గినచో రాశియొక్క సెలవు ఏమాత్రము హెచ్చుననుట రెండవప్రశ్న. అనగా ధరలకును విక్రేయరాసులకునుగల సామ్యమేమి యనుటయు యీ ప్రశ్నల యాంతర్యము.

దీనికి నుత్తరము:-

వస్తువుల గుణములంబట్టి వెలల చలనము అధికముగనో యల్పముగనోయుండును. అన్నివస్తువుల చాంచల్యము నేకక్రమముగ నుండదు. ఉదా. ఉప్పుయొక్క గుణములు రెండు. మొదటిది. అది ప్రాణాధార పదార్థముగాన నావశ్యకము. రెండవది. వాని నెక్కువ యుపయోగించిన నరుచి పుట్టునుగాన మమత పరిమితము. అట్లగుట