పుట:Bhaarata arthashaastramu (1958).pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాదు. వెలలు ద్విగుణములైన క్రేయములు అర్ధరాశి యగునను నిజములేదు. పదార్థములయు వానియందలి మమతయొక్కయు గుణములను ఆవశ్యకతనుబట్టి యీ చలనముల గతులేర్పడును. తగ్గును హెచ్చును అని మొత్తపుటర్థముగా నిశ్చయింపనగునుగాని, యిన్నిన్ని మాత్రలుగ మాఱునని నిర్ధారణజేయుట యసాధ్యమైనపని.

మఱియు నికముందు వివరింపబడునట్లు ఈ తారతమ్యములు ప్రసిద్ధములగుటకు గాలముపట్టును. ఈ కాలము పూర్తియగులోన నితరహేతువు లుద్భవించి పైవిధంచిన న్యాయమును బాధించినను బాధించుటగలదు. న్యాయములు పక్వతకువచ్చి తమ తమ నైజ వృత్తులకుం దగినమాడ్కి ఫలంబులొసంగుటకు కాలసమాసన్నత వీడరానిసమయము. ఈ కాలములోన విరుద్ధకారణములు ప్రారంభించి ఫలములతీరును జెడగొట్టునేమో! కావున గిరాకికి ధరలకునుండు క్షయవృద్ధి న్యాయము అబాధితంబైనచో బ్రవర్తిల్లునదియనియు, ఎపుడైనను బాధ్యంబేకాని నిరామయంబు గాదనియు నెఱుంగునది. విఘాత ప్రత్యయములు క్రిందున చర్చింపబఘియున్నవి.