పుట:Bhaarata arthashaastramu (1958).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దారిద్ర్యహతులకో ఇవి విశేషపదార్థములు. పెండ్లి తాంబూల శాస్త్రమునాడుదప్ప దక్కినప్పుడు వీని యావశ్యకతలేదు. ఇవి లేకున్నను గలియో యంబలియో యారగించి కాలయాత్ర నడుప జాలుదురు. వెలలధికమైన వీనిని గ్రహింపవలయునను నుత్సాహము వ్రాలును. వెలలువ్రాలిన మీదికెగయును. కావున వెలలచే నీపదార్థములు వికల్పమునకుం బాత్రములు.

4. అపేక్షయొక్క విన్యాససన్యాసములు వస్తువులనేగాక ధరలసైత మాశ్రయించెడు. ఎట్లన, వెలలు విపరీతముగ బెరిగిన మీద నించుకతఱిగినను సపేక్షకులసంఖ్య యెదుగబోదు. ఉదా. నెయ్యి మణువు 10 రూపాయలమ్ముచునుండి 9 1/2 రూపాయలకుదిగినను గొనువార లెక్కువగ రాబోరు.

మఱియు నేయి సేరు అరణాకు నమ్మునట్టి కృతయుగము వచ్చెననుకొందము. వెల యత్యంత స్వల్పముగాన నాబాలగోపాల మెల్లరును వలసినంతకొని కుండల నండాల నింపియుంతురు. అరణా నుండి కాలణాకు దిగినను నింతకన్న నెక్కువ గొందురనుట సందేహాస్పదము.

కావున ధరలు అమితవృద్ధి క్షయస్థితులం జెందెనేని అల్ప వికారముచే నన్వేషణోత్సాహము మార్పు మిక్కిలిగ జెందదు.

5. పదార్థములు త్వరలో క్షీణించునవియు ననావశ్యకములు నయ్యెనేని వాని ధరలు తామరపాకులోని నీరుబలె నిలుకడలేని చలనము వహించును.

ఉదా. చేపలు; ఇవి యొకటి రెందు దినములకన్న నెక్కువగ నుంచుటకు గాదనుట ముక్కులుండు వారికెల్లరకు దెల్లంబ; మిత కాలమ్మున నమ్మవలయుట యావశ్యకము. అసాధారణభోగ్యములకుం జేరినది గావున 'రాజుమెచ్చినది రంభ' యను సామెత ప్రకారము జనులచిత్తవృత్తిని క్రయమును ననుసరించి యాదరమేర్పడును. కావున