పుట:Bhaarata arthashaastramu (1958).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నరములు విశ్రాంతి జెందినవిగాన రెండునాళ్ళు పనిసేయకయున్న గుఱ్ఱముబలె మిగుల జుఱుకుగా నుండును. అప్పుడు కొంచెముజ్యోతి సోకినను ఆ నరములు విశేషముగ జలించును. వెలుతురునకు వాడుకపడుకొలది నవి యలసట నొందుటయేకాక కాయగాచినట్లు గడుసు వాఱును. అప్పుడు మునుపటివలె నంటియునంటని వెలుతురు దెబ్బ దవిలిన జాలదు. ప్రేరేపకముయొక్క తీవ్రతను అధికగతిని దీపింపజేసినంగాని ప్రకాశంబు స్ఫురితంబుగాదు. ఈ చర్చ యింత మాత్రము చాలును. ఆమూలాగ్రముగ నెఱుగంగోరిన మనశాస్త్రమును బఠింపుడు!

వస్తు సంపాదనము తృప్తికి ప్రేరేపకము తృప్తిభావము. కావున తృప్తి యార్జితరాసులతో సమానవిన్యాసము వడయనేరదు.