పుట:Bhaarata arthashaastramu (1958).pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భావప్రేరేపకములకుండు సామ్యము మమతకు రాశికిగల సామ్యము బోలినది. పటము చూడుడు!

ఈ సామ్యము తుదవఱకును సరిపోవును. ఎట్లన వెలుతురు మిరెపకాయ ఇత్యాది ప్రేరేపకముల నమితములంజేసిన యా యింద్రియములకు నొప్పి కలుగుననుట మూఢులకైనను దెలిసిన సంగతి. ఒక్కతూరి బాధ ప్రారంభించిన నుద్దీపకకారణము లెంతమట్టునకు వ్యాపించునో యంతవఱకు యథాక్రమముగనేకాక యధిక క్రమముగను బాధ వ్యాపించును. ఇవి యన్నియుం బ్రత్యక్ష సిద్ధములగు సిద్ధాంతములు.

సుఖభావములు హీనవృద్ధి జెందునవి. అది సుఖమునకన్న నంత్యసుఖము హ్రస్వము. భావస్ఫురణ మవరోహించుచు వచ్చినను నుత్తేజకములు పరిమితికి మీఱకున్నంత వఱకును మొత్తపు సుఖమారోహించును. కారణముతో సరిసరిగా నెదుగకున్నను దప్పక యెదుగును. అమితరాశిగా ప్రేరేపకమున్న భావముయొక్క స్వభావమే మాఱును. సుఖముపోయి దు:ఖమాదేశమగును.

చూచితిరా! వృద్ధినివహము గంగానదియుంబోలె మూడు త్రోవల బోవునదియు ముల్లోకముల వ్యాపించునదియునై యున్నది. భూమిని, యంత్రాది కళలయందును మాత్రమేకాదు. మనుజుల యాత్మలందును వాని కనివార్యసంచారము గలదు. వస్తువులు రాశికొలది సరిసమమైన తృప్తినియ్యమికి నిప్పుడు సూపిన యాత్మతత్త్వమే ప్రధానకారణము.

ఇంతదూరము చెప్పితిమిగాన నీతత్త్వముయొక్క జనన వృత్తాంతమునుంజెప్పి మీచింతవాపుట విధిగాబోలు. వ్యాఖ్యానమును సులభవేద్యమే. నిదురనుండి లేచినతోడన కన్నులువిప్పి చిన్న దీపము జూడబోయినను మిఱుమిట్లు కలుగును. కారణమేమి? దృష్టి