పుట:Bhaarata arthashaastramu (1958).pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆఱవ ప్రకరణము

గిరాకి యతిశయించెననుట కర్థము

ఏవస్తువునకైనను గిరాకి హెచ్చెననుట కర్థమేమనగా వెల తగ్గిన నెక్కువరాశి సెలవగుననుటగాదు. మఱి పూర్వపు ధరలకే యెక్కువ రాశిం గొందురనియో ధరలు హెచ్చినను బూర్వపురాశియంతయు గొందురనియో అమ్ముధరలు కొనబడు రాసులు రెండును మునుపటి కన్న నధికములైనవియనియో భావము. దరఖాస్తు అనునది ఱిత్తకోరికగాదు. మఱి వెలనిచ్చి కొనుటకు సిద్ధముగనుండు కుతూహలము. ఏప్రయాసయు నష్టము గష్టమును లేకయు కోరికలు నిండునవియైన గోరికలకు మితము నంతము నుండవు. శ్రమయను శుల్కము గట్టనిది సిద్ధులు వడయబడవు. సిద్ధులయందలి యుత్కర్షము పాఠము గలిగి యుండుట కదియు కారణము. కావుననే దరఖాస్తుకాబడు వస్తు పరిమాణము వెలలకొలది గురులాఘవంబునకుం బాత్రంబైయుండు.

దరఖాస్తు, సరపరా యనునవి హెచ్చెను తగ్గెను అనుటకు ప్రతిమనుష్యునియందును హెచ్చెను తగ్గెను అనుటగాదర్థము. వెలలు హెచ్చిన ననేకుల గిరాకితగ్గినను వస్తువు అసాధారణ మాయెనని. ధనికుల గిరాకిహెచ్చినను హెచ్చును. కావున యధార్థమేమనగా మొత్తముమీద పణ్యచక్రంబున హెచ్చెను తగ్గెను అనుట.

గిరాకికి ధరలకునుండు సామ్యము

అమ్మగోరిన రాశి యెక్కువ యయ్యెనేని వెలలు తగ్గించుట సాధారణముగ నావశ్యకంబైన క్రియ. అనగా వెలలు కుఱుచలౌ కొలది దరఖాస్తు మొత్తము సహజముగ బొడవగును.

ఇట్లనుటచే వీనిలోని చలనములు యథాక్రమములని కాని మఱియేదైన ఖండితమైన క్రమము ననుసరించునవియనికాని చెప్పుట