పుట:Bhaarata arthashaastramu (1958).pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లతో విరమించిన జాలదు. కాన నింకను విచార్యము. మరల నీపటమున గమనింపుడు.

త్రాగను ద్రాగను సుఖము - అనగా ప్రయోజనము కొఱత వడుటయు, కొంతవడికి బ్రయోజనము పూర్ణమై యదృశ్యమగుటయు, మఱియు బలాత్కారముగ నాస్వాదింపబూనిన కష్ట మావిర్భవించి రాశితోడ గ్రమగతి విజృంభించుటయు నిచట స్పష్టములు. అది యట్లుండె. ప్రకృతము ప్రయోజన నూన్యతమాత్రము యోచింపుడు.

తిలిగ్రుక్కచే గలిగిన ప్రయోజనమునకు ఆదిప్రయోజనము, ఆద్యుపయుక్తి ఇత్యాదులు నామములు.

ఏదైనరాశియందు అంత్యభాగముచే గలిగిన యుపయోగమునకు అంత్యప్రయోజనాదులు పేళ్ళు.

ఇక నంతరాశిని గడించినందుననో యనుభవించినందుననో కలుగు మొత్తపు సుఖము సమాసోపయుక్తినాబడు

పైపటములో అ = ఆద్యుపయుక్తి, ఆ = 5 గ్రుక్కలప్పటి యంత్యోపయుక్తి 1, 5, అ, ఆ లచే జుట్టబడిన న్యాసము సమాసోపయుక్తి. ఒకవేళ మూడు గ్రుక్కలకే చేతనున్న చెంబు నెవరైన లాగికొనిరేని అప్పటి యంత్యోపయుక్తి. ఇ. అట్లే వివిధరాసులకు నవి యెఱుంగునది.