పుట:Bhaarata arthashaastramu (1958).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాశి యెక్కువయగుకొలది నూతన (లేక. అంత్య) భాగములచే నబ్బు సుఖము క్రమముగ దక్కువ వడియెడు కావున రాశి తఱుచగుడు నద్దాని యంత్యభాగమువలని గుణము కుఱుచవడును.

రాశి యత్యల్పమైనపుడు గలుగు మహోద్దండ సుఖము ఆద్యుపయుక్తి.

రాశింబట్టి, యా రాశిలోన నంత్యభాగమై, తత్పూర్వభాగములకన్న దక్కువయగు సుఖము నిచ్చునదియైన దానివలని ప్రయోజనము అంత్యోపయుక్తి.

ప్రతిభాగముయొక్కయు సుఖమును జమచేర్చుటచే, వస్తువుయొక్క రాశి సమస్తముచే నీబడిన సుఖ మేర్పడియెడు. దీనిపేరు సమాసోపయుక్తి.

మూల్యము ప్రయోజనముచే నిశ్చితమనగా నంత్యప్రయోజనముచే ననిమాత్రమర్థము. గాలి యమితరాశిగాన నంత్య ప్రయోజనము దానికిలేదు. సమష్టిప్రయోజనమున్నది. కావుననే దానియందు మనకెంతయో గౌరవ ముండుట. ఈ గారవము డబ్బునిచ్చి పుచ్చు కొందమను బుద్ధిని గలుగజేయునదికామి యెల్లరకు దెల్లంబ.

పూర్ణోపయుక్తి యున్నంజాలదు. అర్థపదవి నందుటకు నంత్యోపయుక్తి ప్రధానము. ఈ సిద్ధాంతము నింకను విపులముగ వ్రాసి ప్రస్ఫుటం బొనరించెదము.

మూల్యవిషయమైన విస్తారవ్యాఖ్యానము

ఫలసిద్ధినొసంగి కాంక్షలబూరించు గుణంబు ప్రయోజనము నాబడు. కాంక్షితవస్తుసిద్ధియే ఫలసిద్ధి. ఈప్సితరాశి యధికమౌకొలది వాంఛయొక్క తీవ్రతముం దఱుగుచు వచ్చును కోరికకొలది గడింపబడినచో నాశనిండి యంతమొందును. ఆశ యరటి చెట్టువంటిది. ఫలమునకు గారణభూతమయ్యు ఫలాభివృద్ధితోడ క్షయముం దాల్చును. దీనిని నీటిసామ్యముచే మున్నే సూచించితిమి. సూచన