పుట:Bhaarata arthashaastramu (1958).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. కొన్నివాంఛలు పరస్పర విరుద్ధములు. అనగా నొకటి యున్న నింకొకటి యాతరుణమ్మున మనసులో నిలువజాలదు. కార్యసిద్ధియం దాదరమున్నవాడు సోమరితనమును మానుకోవలసి వచ్చును. లోకోపకారబుద్ధియున్నవానికి స్వప్రయోజన పరత్వము నశించును.

4. ఏక్రమప్రకారము వాడుకగలిగి వర్తింతుమో యాక్రమము దృఢమైన యాచారస్వభావము జెందును. అనగా వాడుకలవల్ల వాంఛ లుద్భవిల్లుననుట. ఎట్లన - స్నానముచేయక మయిలబట్టలనే కట్టుకొని చూచువారికి ఱోతయగునట్లు వర్తించు మాల మాదిగలను గొన్నిమాసములు నయముచేతనో భయముచేతనో ప్రతిదినమును శుద్ధిగానుండునట్లు చేసితిమేని వారికే సహజముగ శుభ్రతయం దభిరుచి కలుగును. ఊరక శిక్షించుటలో లాభములేదు. శీలము అభ్యాసమువలన గుదురును. మనదేశస్థులు తమ నివాసములనుగాని, గ్రామములనుగాని యారోగ్యకరమగు స్థితియందుంచక, యెక్కడజూచినను ఎరువు, పేడ మొదలగు దుర్గంధపదార్థముల నుండనిత్తురు. ఇందుచేత రోగములు అంటువ్యాధులు విశేషముగ వ్యాపించుచున్నవి. మఱియు ననేకులు ముఱికినీళ్ళనుద్రాగుట, కుళ్ళిన వస్తువుల దినుట మొదలగు చెడ్డవాడుకల వదలకున్నారు. దీనిచే దమకేగాక యిరుగు పొరుగు వారికిని కీడుమూడును గదాయని యోచింపరు. అభ్యాసము వలననే యనాచారముసైత మాచారమట్లు తోచును. తీర్థయాత్రలకు బోయి వ్యాధిగ్రస్తులు వ్రణపీడితులును స్నానముజేసి గుడ్డలుతికిన కొలనిలో జుగుప్సజెందక తామును స్నానముజేసి గుడ్డలుతికి యా రోతనీటినే పరమపావనమైన తోయమని కృష్ణార్పణమని బహుప్రీతితో బెదవులు చప్పరించుచు ద్రావుచుండుట జూచిన శుచిత్వబుద్ధిగల యేనరునకును వాంతిరాకమానదు.

అనుష్ఠానమువలన నేపనియైనను స్థిరమైన యలవాటుగా పరిణమించునుగాన హీనకులులను వృద్ధికి దేవలయునన్న వారికి నాగరికత