పుట:Bhaarata arthashaastramu (1958).pdf/467

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్థాపించియున్నారు. తమవా రప్పుడప్పుడు వేడుకగా ప్రొద్దుపుచ్చుటకై వినోదసభల జేయించెదరు. వీనివలన దేశములోని జనులలో పరస్పర గౌరవము మైత్రియు వృద్ధియగుచున్నవి. అపరిపూర్ణములైన వర్గములు, ఇంచుమించు సామాన్యసంఘములవలె నున్నవి యంటిమి గాదె? ఇవియు గొన్నివిధము లంజూచిన నట్టికంపెనీలకన్న నెంతోమేలైనవి. ఎట్లనిన:- 1. కంపెనీలలో భాగముల ననుసరించి యధికారముండెడిని. అందఱుగలసి యాలోచనకు గూర్చున్నపుడు ఒక్కభాగముగల వాడీయగల సమ్మతియొక్కటియ. పది భాగములు గలవానియవి పది. అసమగ్ర పరస్పరవర్గములసైతము భాగస్థు లందఱు సములు. 10 రూపాయలు మూలధనమువేసినవాని కెంత సొంతమున్నదో యంతేగాని 100 రూపాయల యాసామికి నంతకన్న నెక్కువ సొంతముండదు. 2. కంపెనీలలో మూలధనముయొక్క - అనగా భాగములయొక్క - పరిమాణము నియతమైయుండును. లక్ష రూపాయల మూలధనముగల కంపెనీ యిదియని సర్కారులో రిజిస్టరయ్యెనేని అంతకన్న నెక్కువ భాగముల నేర్పఱుపవలయునన్న గవర్నమెంటువారి యంగీకారము బడసినంగానికాదు. మఱియు భాగములు నియతములై యుండుట వలన కొందఱు ధనాఢ్యులా యుద్యమము లాభకరమని యెఱింగిరేని పాళ్ళంతయు దామేకొని యితరులకు సందియ్యరు. ఇక నిర్మాణమన్ననో యదియు బలాఢ్యులకు కార్యమునెల్ల గైవసము చేయునదియ. సాధారణములైన సంభూయ సముత్థానములన్నియు గొందఱు గొప్పవారిచే బరిపాలిత ములు. భాగస్థ బాహుళ్యమునకు నంతగా నధికారములేదు. అసంస్కృతములైన యన్యోన్యసమాజముల యు మార్గములువేఱు. భాగములిన్నియని నియతములుగానందున నెందరైన వానిలో జేరుటకు నాటంకములేదు. అధికారము సమాజ బాహుళ్యముం జెందియున్నదిగాని యొకరిరువురియం దస్థిరమై నిలుచునదిగాదు. మఱియు నిన్నింటికన్న