పుట:Bhaarata arthashaastramu (1958).pdf/468

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నెక్కువభాగము లొకచేతిలోనికి రాగూడదని నియమముండుటచేత గొందఱు ధనికులు వానినెల్ల నాక్రమించుకొనుట యసాధ్యము. అనేక వర్గములలో నీ మితము 3000 రూపాయల విలువగల భాగము. ఇంతకన్న నెక్కువగ నెవ్వడును మూలధనము వేయగూడదు. 3. కంపెనీలలో లాభమును భాగముల ప్రకారము పంచియిత్తురు. ఇందుచే నెక్కువ భాగములు గలవారు ఆదాయములో నెక్కువపాలు మ్రింగి శేషించిన యుచ్ఛిష్టము నితరులకుం బెట్టుదురు. ఈ వర్గముల నట్లుగాదు. వాడుకకాండ్రకు వారుగొను సరకులకొలది తొలుత లాభములో నొకవంతు పంచియిచ్చి, మిగిలినదానిని మాత్రము మూలధనమునకు జెందునంశమని నివేదింతురు. వాడుకకాండ్రకు నీ లాభములజేర్చు విధములురెందు. 1. తఱుగుడునిచ్చుట. 2. ఇంకను ముఖ్యమైనరీతి యేదనగా 100 రూపాయల సరకుల గొన్నవారికి నీమాత్రమని సంవత్సరాంతముననిచ్చుట. అనగా బ్రతివాడును గొనుసరకు మూల్యము లెక్కవెట్టి తదనుక్రమముగ లాభభాగముల విధించుట. వినియోగము ననుసరించి సరకుల గొందురు. ఎక్కువ లాభము గ్రహింపగోరి వినియోగ కార్యమును - అనగా తినుట, కట్టుట యిత్యాదుల - నే లోభియు నెక్కువ సేయడు. మొత్తముమీద పుంజీదార్లకు నీ వర్గములో ప్రధానత్వము మిక్కిలి తక్కువ.

అక్కడక్కడ వెదజల్లినట్లుండు నీసంఘములు, కలయిక గలిగి యున్నంగాని తమకు బ్రదుకు బలము కష్టములని యొండొంటితో సంధినెఱపి, దేశీయమైన యొక్కటే మహాసంఘముగా నేర్పడునట్లున్నవి. ప్రతిసమాజములవారును, ఏటేట జఱుగు దేశీయ పరస్పరవర్గ మహాసభకు ప్రతినిధులను బంపుదురు. ఈ మహాసభలో నన్యోన్యతా విషయమైన యఖిల విషయములును చర్చింపబడుటయే కాక అయ్యై సంఘములవారిచే బరిశీలితములైన నూతన సంగతులును అఖిలవేద్యములుగ జేయబడును. ఇవియన్నియు నేకకుటుంబ