పుట:Bhaarata arthashaastramu (1958).pdf/463

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'ఓల్‌డ్ హేమ్‌' అను పట్టణములోని వస్త్రరచనాశాల లనేకములు శ్రమకరుల యధీనములై యున్నవి. అయిన నొక్కటి. ఏశాలలలో దమకు భాగములున్నవో యందు దాము పనిచేయక తదితరశాలలలో గూలికి నిలుతురు. మొత్తముమీద నివి సంభూయ సముత్థానములకుం (జాయింట్ స్టాక్ కంపెనీలకుం) జేరినవికాని పరస్పరతా పద్ధతిం దాల్చినవికావు.

ఇంగ్లాండుగాక తక్కిన పశ్చిమదేశములలోని కో ఆపరేటివ్ సంఘముల చరిత్రములు

ఇవి రెండువిషయములలో నింగ్లాండును మీఱియున్నవి. వేని యందన 1. వ్యవసాయమున. 2. ఋణసాహాయ్యార్థమైన నిధిజాలమున.

వ్యవసాయము:- కాపువారు ఇతరేతర సహాయార్థము సంఘములుగనేర్పడి కర్షణ యంత్రములు మొదలైనవానింగొని వంతుప్రకారము వానిని వాడుకొనుట, ఎరువు మొదలగు సామగ్రులను మొత్తముగాగొని పంచుకొనుట, ధాన్యమును బ్రోగుసేసి యందరును గలసి యేకవాక్యముగ వర్తకులతో బేరమాడుట, ఇత్యాది క్రియలచే దమ దారిద్ర్యము నివారించెదరు. మఱియు సంఘముగ నప్పుగోరిన తక్కువవడ్డీకి లభించుగాన సర్వవిధముల వ్యయము తగ్గునట్లును, ధాన్యము, వెన్న, జున్ను, వీనివెల హెచ్చునట్లునుజేసి మునుపటివలె గష్టనష్టములకుం బాత్రులుగాక యిప్పుడిప్పుడు ధనము మిగిల్చి కూడ బెట్టువారును అగుచుండుటజూడ నిట్టి వర్తనముల హిందూదేశీయు లభ్యసింప గలిగిరేని మనవారును ఇంచుమించుగా బచ్చగానుండక మానరనుట విశదము. డెన్‌మార్కు దేశములో వెన్నదీయు శాల లఖండములుగ నున్నందున నద్దాని యెగుమతి యేటేటకు నెక్కువ యగుచున్నది.

కో ఆపరేటివ్ బ్యాంకీలు కృషీవల సంఘములకు నెంతయు దోడై సాహుకారుల చేతులలోజిక్కి కాపువారు నలగకుండునట్టు