పుట:Bhaarata arthashaastramu (1958).pdf/464

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లుద్ధరించుచున్నవి. తన నాణెముబట్టియే యప్పుదీయవలయునన్న నెక్కువ వడ్డీకి సమ్మతించినంగాని కాదు. సంఘ ముత్తరవాదిగానున్న తక్కువ వడ్డీకి నెవరైన నిత్తురు. కావున బలహీనులును పొత్తుచేత ధనాఢ్యులవలె సత్తువగలవారగుట సర్వజనవేద్యముగాని, యట్టి పొత్తునుగలిగి కలసిమెలసి యుండు గుణమ్ము లింకను ననుభవమునకు బాగుగవచ్చినట్లు గానము. ఇతర దేశములలోనికన్న హిందూ దేశమున సులభఋణము ప్రధానము కారణమేమనియందురేమో వినుండు! వాన లప్పుడప్పుడు రాకపోవుటచేత కిస్తీ చెల్లించుటకును, పండుగలు, వివాహములు, చావులు, పుట్టుకలు ఇత్యాది సంస్కారములు వలదన్నను దమంత వచ్చిపడుటచేత బలాత్కార దానధర్మోత్సవాది క్రియలకు నరణముం బెట్టుటకును ద్రవ్య మమేయముగ గావలసి యుండుటయేకాక, యా సమయమునకే తప్పక లభించినంగాని మానహాని సిద్ధము. కావున కాపులు తరుణమువేచి నిలిచి నిదానముగ బేరమాడ లేరు. వృద్ధ్యాజీవులైన సాహుకార్లు ఇదే మనకు సమయమని 100 కి నెలకు రెండుమూడుగ వడ్డీవిధించి, నేలల కుదువ వ్రాసికొని రైతుల నెల్లవిధముల గొల్లగొట్టి, పాపపరిహారార్థము గుళ్ళుగట్టించి ధర్మాత్ములని ప్రసిద్ధి వడయుట మనకందఱకును దెలిసిన సంగతియ కదా! నాకుంజూడ దేవస్థానముల గట్టించుట భక్తిచేతగాదు, మఱి కృతజ్ఞతమై. ఎట్లనిన, దేవతలకు దృప్తిచేయుటకైకాదె కాపువారు సంస్కారముల నిర్వర్తింపబూని తమకు వికారముందెచ్చికొనుటయు, సాహుకార్లకు సర్వస్వము ధారవోయుటయు? కావున దేవతలు అన్యాయవృద్ధికి స్థానములును, రైతులకు అష్టదిగ్బంధనములునై, యుండుటచేత ఋణజీవులకు పరమాశ్రయులు, నిత్యసేవ్యులు. పరలోకమున మోక్షమిత్తురో యియ్యరోకాని, సాహుకార్ల ఇహలోక మోక్షమునకు వారు కల్పవృక్షములు. ఈ వృక్షముల నెండనెట్టినం గాని కాపువారికి సుఖజీవన మసంభనము. ఈ విషయము వినిమయకాండ సంబంధి గావున నింతటితో నిప్పటికి వదలవలయు.