పుట:Bhaarata arthashaastramu (1958).pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెఱుగుటలో విఱుగుటయను నుపద్రవం బుపగతంబు. విఱుగుటకు వీలులేని యుపాయము వెదకంబోయిన బెఱుగుటయే కూడదన వలసివచ్చును. ఇది సమంజసమైన తంత్రమా ? మఱియు క్షోభలు విశేషించి కలుగు దేశము లెవ్వియనిన, ఇంగ్లాండు, అమెరికా, ఇవియే ప్రపంచమున నత్యంత జేజోవంతములై యున్నవి. నికృష్టములై యుండు తూర్పు రాజ్యంబుల నప్పునప్పులేని జీవనముండిన నదియే యొక యతిశయము. మనలో క్షోభలు లేవనుట యొప్పుకోవలసిన మాటయే. తిండికిలే దనుట దానికన్న స్ఫుటమైన వాక్యము.

కారణంబేమియనగా, తెగువలేనిచో జయమసాధ్యము. తెగువతో నుద్దండవిహారమునకుం దొడంగిన గొందఱోటమిదెచ్చికొన్నను గొందఱయిన గట్టెక్కెదరు. ఈ ప్రకరణమున గిరాకి సరఫరా వీనికి సమత్వము గుదిరిన కష్టనష్టములు లేకయుండునని యంటిమి. ఇదియు నాక్షేపములేని మతముగాదు. ఎట్లన, గిరాకి సరఫరాలు సరిపోవుటెట్లు? రెంటిని స్తిమితము గా జేసియుంచినగదా? గిరాకి యనగా వస్తువుల యందలి వాంఛచే గలిగిన యన్వేషణ క్రియ. ఇక సరఫరా యనునది కళాప్రావీణ్యముచే నిర్ధారితము. ఈ రెంటిని స్తిమితములం జేయుట యన్ననేమి? హిందూదేశమ్మునంబలె నాచార పాశంబులచేత గోరికలను వృత్తులను బంధించి చెఱనుంచుటయగాదె! అందుచే గలుగు క్షయము క్షోభలకన్న మహాదైన్యకారియని వేఱుగ జెప్పవలయునా? సాహసవ్యాపారలక్షణము లెఱింగియేయున్నారు. అనుమతిమీద జేయబడుటయేగాక, ఇక ముందైన గిరాకి రాకపోవునాయను కుతూహములచే జేయబడు నది సాహస వ్యాపారము. మఱియు బ్రకృత మొక వస్తువునెడ గాంక్షలులేకున్నను వాని సృష్టింపసైతము చూతురు. ఇట్టి వ్యాపారముల నప్పుడప్పుడు పరాజయ ప్రాప్తియగుట నిశ్చయమ. సాహసములేక గ్రామములయందలి శిల్పులబలె నిశ్చితమైన పంపు వడసికాని పదార్థముల సేకరించరేని నష్టముండదేమోకాని లాభము