పుట:Bhaarata arthashaastramu (1958).pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మఱియు, ఇట్లు లబ్ధలాభులైనయెడల ద్రవ్యము మిగులంబడుట, కూడుట, ద్రవ్యాభివృద్ధిచే మఱల బొగరుచెట్టు చిగుర్చుట, అత్యుద్దండకర్మల విఱ్ఱవీగి యారంభించుట. మఱల బూర్వోదిత ప్రకారము త్రుళ్ళి క్రిందబడుట.

ఈ రీతి నార్థికచక్రము హీనోచ్ఛస్థానక్రమం బవలంబించి యుండుననుట గణింపవలసిన విషయము.

అయినను నీగతి మునుపటియట్టులు నిరర్గళ సంచారముగలది గాదు. నిరోధన తంత్రంబునందు, ఆధునికులు దక్షులై యుండుటచే క్షోభ లల్పములగుచున్నవి.

ఖండాఖండ క్షోభలు

క్షోభలు రెండు విధములు - 1. అఖండక్షోభలు. సర్వవృత్తుల యందును వ్యాపించునవి. 2. ఖండక్షోభలు కొన్నింటియందుమాత్రం వ్యాపించునవి.

1. మూలధనముయొక్క స్థితులచే బుట్టునవి సర్వవ్యాపకములు. ఎట్లన, వ్యవహారు లెల్లరు ప్రజలచే నిక్షిప్తంబులైన ధనంబులతో గార్యముల నడుపువారు మూలధన మన్ని ప్రారంభములకును సామాన్యకారణము. దీనిచేనగు క్షోభలన్నింటికి నంటును.

2. అధికోత్పత్తిచే నగునవి ఖండక్షోభలు. ఎట్లన, అధికోత్పత్తిచే నగు క్షోభము లఖండములు గావనుట.

బేహారమననేమి? వస్తువులకు బదులు వస్తువులనిచ్చి మార్చుకొనుట. ఒక్క వస్తువు నందుమాత్ర ముత్పత్తి యధికమైన దానికి మూల్యము తగ్గుటయో వెలకుంబోక మూల యింటనుంటయో సిద్ధము. ఎందులకందురో, దానిం గొనువారలయందును నుత్పత్తి యధికముగా లేదుగాన వారు దానినంతయు దక్కువవెలకిచ్చినంగాని కొన సమర్థులు గారు. హిందూదేశము దరిద్రస్థితిలో నుండుటంబట్టికదా వస్తువు