పుట:Bhaarata arthashaastramu (1958).pdf/429

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లున్నను మనము గొననేరక మిడుకుచుండుట గలిగెనని యంటిమి. దారిద్రమనగానేమి? మనయొద్ద ద్రవ్యములు లేవనుట. అనగా మనలో నుత్పత్తి మిక్కిలియు జీర్ణమైయున్న దనుట! మనకును విశేషించిన యుత్పత్తియున్న నైరోపావారుపంపునదియెల్ల గ్రహింప వచ్చును. మనయందుబలె ప్రత్యర్థులయందును వస్తురాసు లఖండములైన మన సరకులను వారుం గొననేర్తురు.

చూడుడు! గిరాకియన్న వ్యర్థమైన యాశగాదు. సమర్థమైన యాశయని యంటిమి. సమర్థత యనగా నర్థముతోగూడిన శక్తి గలిగినదనుట.

కావున సర్వవస్తువులు నేకకాలంబున నేకగుణంబుగ వృద్ధిం గాంచిన నధికోత్పత్తిదోషంబు వొరయదు. ఇచ్చువారితో సమముగ గొనువారును సమర్థులౌటబట్టియు వాంఛ లమేయములుగ నుంటం జేసియు వానికి అమ్మకము నీళ్ళుద్రావినట్లు సులభంబగును. ఉదా. 1. ఇంగ్లాండులో వస్త్రములు, మన దేశములో ధాన్యాదులును సరిసమముగ నధికములైన వారికి వస్త్రములేల వెలపోవు? మనకు ధాన్యాదికము లేల యెగుమతి గాకపోవు?

2. మూల్యసిద్ధాంతముచే నియ్యది యింకను స్ఫుటంబవును. ఒకదేశమున పశువులు గుఱ్ఱములునే యున్నవనుకొందము. పశువులు 200, గుఱ్ఱములు 100 వెల యొక గుఱ్ఱమునకు రెండావులు. రెండును నేక కాలమున ద్విగుణితములయ్యెబో. పశువులు 400, గుఱ్ఱములు 200. వీనియందలి యాదరణము రాశి యెక్కువయైనందున తగ్గును. రాసులు సమానవృద్ధిం గాంచినందున నాదరము, ఏకక్రమముగ దఱుగును. అందుచే మూల్యమునందు విభేదముపుట్టదు. అనగా నిప్పుడును నొక గుఱ్ఱమునకు రెండావులు విలువ. సమానవృద్ధి లేదనుకొందము. ఆవులు నన్నూరై గుఱ్ఱము లేబదికి వచ్చెబో. పశుపాలురకు నావులయందలి రాగము తగ్గును. గుఱ్ఱముల యందలి రాగము హెచ్చును. అశ్వపాల