పుట:Bhaarata arthashaastramu (1958).pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈదోషమునకుం బ్రతిక్రియ యేదనగా నుపకళలు మఱియు విజాతీయములైన ఇతరకళలును బ్రతిష్ఠితములౌట. ఒకటి ముఖ్యముగానున్నను దానిం బరివేష్టించి గ్రహములువోలె మఱికొన్నియున్నను నింకను మంచిది.

ప్రకృతము కళాగంభీరములైన పట్టణము లతిశీఘ్రముగ బశ్చిమ రాజ్యములలో వ్యాపించుచున్నవి. లండను మహాపట్టణము యొక్క జనసంఖ్యయు వైశాల్యమును గంతులువేయుచు మీఱుచుండుట దీనికొక దృష్టాంతము. ఒక లండను పట్టణముయొక్క జనసంఖ్య యెంతని భావించెదరు? మైసూరి సీమయందలి దానికన్న రెండింతలు! ప్రత్తిశాలలచే బరిశోభితంబైన 'మాన్ చెస్టరు' అను నగరమునిట్లే. ప్రతిదినము నెల్లల దాటుచున్నది. మనదేశములో గ్రామముల పొలిమేరలవద్ద సరిహద్దుల రక్షించుకొఱకు నెల్లమ్మ యను దేవతను నిల్పుచున్నారుగదా! మనగ్రామములు నిలుకడ గలిగిన పరిమాణములు గలవిగాన ఎల్లమ్మ, కదలక మెదలక పెట్టిన తావుననె గూటముమాదిరి నుండవచ్చును. ఒకవేళ నింగ్లాండులో నెల్లమ్మలను నిల్పితిమేని యీ యెల్లమ్మలు దినదినము ముందునకు బోరేని, ఎల్లల గోచర దూరస్థములౌను. ఈ వ్యాప్తికి గారణం బేమియనిన; ఆ పట్టణములలో ననేకవిధములైన కళలు నుపకళలు నున్నంబట్టి యాబాలగోపాల మెల్లరకుం బనిదొరకుట యతిసుకరముగావున దండోపతండము లుగ జనులు వానిపై దుముకుదురు. జనస్తోమ మెక్కువయైన నింటిబాడుగ లతిశయించును. అందుచే నీనష్టమేలయని జనులు దూరముగనుండు నూతనభూములలో నివాసము లేర్పఱచుకొనుటచేత బురములు విరివిగాంచును. దూరముగబోయిన గర్మశాలలలో బనికిదిగుట యాలస్యము గదాయని శంకింతురేమో! ట్రామ్‌బండ్లు పొగబండ్లును గంటకు బదివంతున బోవుచుచుండగా నాలస్య