పుట:Bhaarata arthashaastramu (1958).pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మేలకలుగును? పట్టణములు ప్రసరించురీతి యిట్టిది. ఏకకళాస్పదమైన జాలదు. అనేక కళలకు నాస్పదమైయుండిన నింకను నుత్తమము.

యానసౌకర్యములే స్థానైక్య మిరుదెఱంగుల విరుద్ధమార్గముల నీడ్వబడుచున్నది. ఎట్లన, 1. క్రయ విక్రయస్థితుల నెఱుంగుట, దూరమ్ముననుండియైనంగొనుట, ఇవి సులభపధంబులగుగాన గళ లెయ్యెడనైన నొండెడ నుండినను గష్టములేదు. ఇందుచే స్థాన సాంగత్యము దృఢతరంబగును. 2. అయినను బ్రయాణ సౌలభ్యముచే గొనువారుండు చోటుల శ్రమకరులునుజేరి యచ్చటనే వస్తురచనలకుం దొడంగుటయు జులకన యగుంగాన గళలు మూలకొక్కటిగా బోవుటయు ననుకూలమ. ఇపుడిపుడు కొందఱు యానవేతనమ్ముల మిగిలించు నభిలాషయు, పట్టణంబుల శుభ్రమైనగాలియు నాఖేటకమునకు దగిన బయళ్ళును లేమియు దమ్ము బ్రేరేప నినుపదారుల పొంత నుండు గ్రామములలో నావేశముల గట్టుచున్నారు. ఉత్పత్తి కళలు చెదిరినను వర్తకుల యాపణము లంతగా జెదరుటగానము ధూమ నౌకాశకటంబులం జేసియకాదె యూరోపియనులు మనదేశమున దామే ప్రత్యక్షించి యార్థిక తంత్రంబులు నడుపుటాయె.

విస్తార శాలలు

ఇక నావేశన విస్తరతంగూర్చిన మంచి చెడుగుల విచారింతము. పరికర్షణ క్రియలైన కృష్యాదులు ప్రకృతి బద్ధంబులుగాన బరివర్తన క్రియ లీన్యాయపరీక్షకు విస్పష్టములైన నిదర్శనంబులు. వస్తురచనా కళలు విరివింగాంచినందుచే గలుగు లాభంబు లెవ్వియనిన:-

1. తమకు సామగ్రులైన యసంస్కృత పదార్థముల గొప్ప గొప్ప మొత్తములుగా గొన వచ్చుంగాన నవి చిల్లరబేరములకన్న నయముగ బ్రాప్తించుటంజేసి వ్యయము తఱుగును.

2. సంక్షిప్త వ్యవహారముల విసర్జితములైన బండములు ప్రత్యేకవృత్తికిం జాలకపోవుటచే వ్యర్థములుగా బోవును. విక్షిప్త వ్యవహారముల నివియు వినియోజ్యములగును.