పుట:Bhaarata arthashaastramu (1958).pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏదైన నొకకళకు ముఖ్యాశ్రయమనిపేరుగన్న యెడకు దద్వృత్తికరులైన శిల్పులు "ఇందఱకు శరణ్యమైన చోట మనకు బని దొరకక పోవునా" యను ధైర్యంబునవత్తురు. కావున శిల్పులకు నట్టిపట్టణములు ప్రకృష్ట శరణ్యములు.

మఱియు నావృత్తిలో జీతములచట నేమాత్రముండుననుటయు సులభవేద్యమగాన గర్మకరులను మోసగించుటకుగాదు. కర్మకారులు శ్రేణు లేర్పఱచి సమూహముగా బేరమాడుటకును నుపాయము సిద్ధించును.

ఇక దోషములు:-

సజాతీయ కళాకీర్ణములైన స్థలంబులలో దదుచిత నైపుణీ సమేతులకుంగాని, ఇతరులకు గూలిదొరకుట కష్టము. దృష్టాంతము. బంగాళాలో మహాఘనమైన యయశ్శాల నేర్పఱచి యా శాలకుంజేరిన వారినే చుట్టుప్రక్కల నివసింపజేసి యయ:కర్మపురి నొండు నిర్మించు చున్నారనియంటిమి. అట్టిచోటుల కుటుంబభారముదాల్చు భంగు లెయ్యవి? ఇనుపపనికి బలాఢ్యులెకాని తక్కొరులు నిష్ప్రయోజకులు. కుటుంబమున బలవంతులైనవారెవరు? పదునెనిమిదిమొదలు నలువది సంవత్సరములలోనుండు మగవారుమాత్రమేకదా! ఇంటి లోని స్త్రీలకు బాలికా బాలకులకు వేఱువృత్తులులేకున్న గడవ యసాధ్యము. కావున గుటుంబముయొక్క యాదాయమంతయు గొందఱచే గూడబెట్టవలసినదగును. సరాసరి యాదాయము కొఱతవడని దానిం జేయుదురయేని, అట్టిచోటుల జీతములు మిక్కిలి ఎక్కువగా నుండినం గానికాదు. కావున స్థలముల కళలసంఖ్య లల్పములౌకొలది జీతము లధికముగావలయును. కానిచో గుటుంబముయొక్క మొత్తపు వచ్చుబడి యనేక కళలగలిగి యందఱకు బనులగూర్చు స్థలములయందంత పూర్ణత వహింపదు.