పుట:Bhaarata arthashaastramu (1958).pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేవిమర్శయుజేయక తనసమాజములలో దగులబెట్టును బయటివారికీసమాచారము తెలియకుండునట్లు నామధేయములు చోదకమండలములును భిన్నములుగ నుండు నట్లు నటింతురుగాన నిది ముమ్మాటి కిని మోసము, ముఖ్యముగా నిధీశ్వరులు నిష్పక్ష పాతబుద్ధితో సత్యాసత్య విచారణ సేయువారుగా నుండవలయుననుట యెంతయు నావశ్యకము.

ఇన్ని కుటిలములకు నాస్పదమయ్యు సంకలిత మూలధనసమాజ పంక్తి యేలవర్ధిల్లు చున్నదని చోద్యమందుదురేమో? ఉత్తరము సుగమము. పశ్చిమదేశములో మొత్తము మీద విశ్వాసము నభివృద్ధి చేయునంతటి యార్జవముండుటయే హేతువు. ఆషాఢభూతు లెందఱో యున్నను నక్కడివారి యపార వ్యవహారములతో బోల్చిచూచిన వారిఘోరము లలక్ష్యములుగానున్నవి. అట్లుగాక సౌశీల్యమునకన్న దౌశ్శీల్యమే స్థిరమైయున్నయెడ నాణెము స్థిరవ్యాపియైయుండునా? ఉండదు. నమ్మకము ప్రసరించు చుండుటయ వారియోగ్యతకు నమోఘమైన సాక్ష్యము.

ఇంగ్లాండులో నిట్టిసమాజములు నన్నింటిని రాజ్యాంగమువారిచే నేర్పఱుపబడిన, గణిత శాస్త్రపారీణు లేటేట లెక్కలన్నియువిమర్శించి పరిశీలించి చోదకులుచేయు ప్రకటనలు బూతులా నిజములా యనుట నిర్ణ యించి యెల్లరకుం దెలుపుదురు. ప్రతిసమాజమును గవర్నమెంటువారి విచారణకు నధీనమైయుండినం గాని వ్యవహారములకు జొఱరాదని శాసనము. కన్ను మూసికొనియుండు భాగస్థులకు దొరతనమువారి సంప్రతులేకండ్లు లోకజ్ఞానము కీడు కౌడు లెఱుంగక పేదసాదలు చోదక సభలయొక్క వర్ణనలు కట్టు కథలును విని బేలువోదురను శంకచే ప్రజారక్షణార్థము ప్రభువులు సంప్రతుల నియోగించినను వీరలగూడ కన్నుపుచ్చునంత సమర్థులైన వ్యాపారు లుండకపోలేదు.

హిందూదేశములోని జాయింటు ష్టాకు కంపెనీలు

ఇంగ్లాండునకన్న మనదేశమున సమాజవ్యాపారమునకు ప్రసక్తి తక్కువ. దీనికెన్నియో కారణము లున్నవిగాని యన్నింటింజూప