పుట:Bhaarata arthashaastramu (1958).pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రచండుడై వెలసి యద్భుతమైన సౌధమొండునిర్మించి యందు చక్రవర్తిగారినిగూడ విందులచే బూజింజి కీర్తిమంతుడాయెను! తనచే సృజింపబడిన సమాజములయందు జనులకు విశ్వాస ముద్ధురమగుటకై యొకానొకప్పు డిండియాదేశపు గవర్నర్ జనరల్‌గానుండిన డఫరిన్ ప్రభువుగారిని చోదకాధ్యక్షుడుగనుండ బ్రార్థించిన నాయుదారచిత్తు డేకాపట్యము నెఱుంగని వాడగుట నిట్టిచతురుడు చేపట్టిన పనికి విఘాతము లుండునేయని సమ్మతించెను. మాయా వ్యాపార మెన్నాళ్ళని నడువగలదు? తుదకున్నట్టుండి రైట్టుగారి కంపెనీ లనేకములు దివాలెత్తినవి! ఇక్కడ 'అర్బత్ నట్‌' ప్రళయముమాదిరి నక్కడ 'రైట్టు' ప్రళయ మాయె! లక్షలకొలది జనములు సర్వముం బోగొట్టుకొన్నవారై దిక్కులు గంపింప నాక్రోశించిరి. డఫరిన్ ప్రభువుగారు నిర్దోషులయ్యును తమపేరునకు బ్రమాదమువచ్చెగదాయని దు:ఖించి యాదు:ఖముచేతనే పరమపదవింజెందిరి. 'రైట్టు' యెన్నియో జిత్తులు తెలిసిన ప్రాతనక్క యగుటచేత వానిపై గేసుదెచ్చి నను జయమసిద్ధమని గవర్న్మెంటువారు పేక్షించిరి. గవర్న్మెంటు వారి యుపేక్షతో మనకేమని జను లందఱు సంతకములుచేసి ధనముగూర్చి వానిమీద నేరముమోపగా హైకోర్టులో గొప్పకేసునడిచి 5 సంవత్సరములు కఠినశిక్ష విధింపబడెనుగాని 'రైట్టు' మాత్రము తుదకు దప్పించు కొన్నాడు! ఎట్లనగా, ఆక్షణమే విషము దీసికొని చచ్చుటచేత!

ఒక్కవ్యాపారము నొక కంపెనీపేరజేయుచు దానిలో వినియోగించుటకై ద్రవ్యము నాకర్షింపంగోరి యింకొకపేర బ్యాంకీలు, ఇన్‌ష్యూరెన్సు కంపెనీలు, తేలజేయువారునున్నారు. ఇట్టివన్నియు గృతిమములేకాని సరియైనవిగావు. ఎట్లందురో, నిధులయొక్క ధర్మం, అప్పులగోరివచ్చు నాసాములయుద్యమములు యుక్తములా, అయుక్తములా, యని పరిశీలించుట నిధినిర్మాతయే వ్యవహార సమాజ నిర్మాతగను నుండినయెడ జనులచే నిక్షేపింపబడు విత్తములను ధారాళముగ