పుట:Bhaarata arthashaastramu (1958).pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిల్పులపాటు గోరవలయు. మావైరులు శిల్పుల నందఱను జీత మెక్కువచేసి తమ యధీనతకు నాకర్షించి కోజూతురు. మేమును నట్లే చేయజూతుము. మాసందడిలో కర్మకరులకు గతులు మోక్షములు తమంతట సిద్ధించును.

4. మఱియు సమత్వమునకు స్పర్ధ కారణముగాని మీరన్నట్లు స్పర్ధకు సమత్వము కారణముగాదు. హిందూదేశములో స్పర్ధలేదు. సమత్వమున్నదని యెట్టిపిచ్చివాడైన బలుకడు. ఇంగ్లాండులో స్పర్ధ యుండుటచేత నానాటికి సమత్వము హెచ్చుచున్నది. ఎట్లన, ఈ వ్యాపారములో నమితలాభము తటస్థించినదనుకొనుడు. విచ్చలవిడి, వృత్తులకుం గడంగుట మనయాచారముగాన నీలాభముచే బ్రేరితులై యనేకులీదిక్కువత్తురు. దానిచే పోటీహెచ్చి సరకులు బలసి లాభముల బక్కవడజేయును. అట్లగుట సమత్వ మలరారు ననుటగాదే?

5. ఇంకను నొకటి, అనర్గళమును నప్రమేయమును నిర్ణిద్రమునైన స్పర్ధను మే మాసించిన వారము గాము. ఆసించినను నది యలవడునదికాదు. మాసిద్ధాంతమేమనగా స్పర్ధ యెంతయెక్కువగనున్న నంతమంచిది. ఇదియ సమాధానమైన నొంకొకరీతిని విన్న వించెదము. అనివార్యమైనయెడలదప్ప శిక్షవిధించుట న్యాయంబుగాదు, అనగా నవరోధకము లెంతతక్కువగనున్న నంతమేలు.

సమష్టివాదము

సంఘ శ్రేయస్సునకు బాధకంబగుటవలన ననవరోధ స్పర్ధ తగదనియు, నద్దానిని సంఘము, ఆత్మీయక్షేమానుకూలముగ నిరోధించుట యుక్తమనియు, సంఘమునకు నాయకత్వంబిచ్చి పట్టాభిషేకంబు జేయజూచుటకు "సమష్టివాదం" బని పేరు. దీనికి నాసికగానుండు హేతువుల వివరమేమన:-