పుట:Bhaarata arthashaastramu (1958).pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. సంఘము శరీరము. ప్రజలు దానింజెందిన యవయవములు. క్రియలయొక్క ఫలంబులు. ప్రజలతోబోక సంఘము నావేశించుంగాన నాక్రియల నిర్దేశించు నధికారము సంఘమునకుం జెందవలయుననుట ధర్మము.

2. అమితస్పర్ధ యరాజకముతో సమానము. అరాజకమునకన్న మించిన యనర్థము, ఎయ్యదియు గానము.

3. వర్తమానమునందలి యార్థిక ప్రపంచమున బీదలకు బ్రదుకు కష్టము. అనిత్యము. స్పర్ధచే సమత్వము సిద్ధించుననుట బొంకు. బలాఢ్యుల పోటునకు దాళలేక బలహీనులు సమయుదురు. బలములేనివారెల్ల సమసిపిదప బలవంతులలో సమానపదవి పదిలమగునేమో! అట్టి ప్రళయకాలపు టీడుజోడుతనము మాకెవ్వరికిని వలదు!

4. ఇంతియ కాదు. స్పర్ధ తేలువంటిది. తన వినాశ హేతువును దనగర్భమందే ధరించిన వికారి. అయ్యది నైజముగ నేకేశ్వరత్వమున సమాప్తినొందును.

5. మేమును శుద్ధముగ స్వాతంత్ర్యము స్పర్ధయు దగదనువారముగాము. మఱేమన్న సంఘమున కేమాత్రముమేలో యావఱకును దానిని శాంతింబొందజేయుట శుభకరంబనుటయే మామతము.

వ్యక్తి సమష్టివాదులకుండు పరస్పరమైత్రి యేమనగా?

ఇరువురును సంఘము యొక్క మేలు మనమంచికన్న పరమ ప్రయోజనంబను వారే. మఱియు నపారములైన స్వాతంత్ర్య పారతంత్ర్యములు రెండును, అననుష్ఠేయములను వారే.

మఱి వీరికింగల భేదముయొక్కవిధం బెట్టిదన, స్పర్ధను మేమాత్ర మెవరిచే నిరోధింపజేతమను నీతివిషయమ్మున.

వ్యక్తివాదులు స్పర్ధానిరోధ మల్పమాత్రము చాలుననియు, ఆయడ్డగింపు సహజముగ స్పర్ధచేతనే కలుగునుగాన నూతన నాయకులను