పుట:Bhaarata arthashaastramu (1958).pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాయకత్వము తగునా తగదా యనుటగాదు. అది యుండియే తీఱవలయు. మఱి యెవరియెడ నుండవలయుననుట.

దీనింగూర్చిన వాదము లనేకములున్నవి. వానినెల్ల నొక్కయెడ బొందించుట కనువుగాదు. సంగ్రహముగ నొండు రెండుం బేర్కొనెదము.

వ్యక్తివాదము

కొందఱు నాయకత్వము ప్రతివానిం జెందియుండుటయే యుత్తమమని యాదేశించెదరు. ఈ మతమునకు వ్యక్తివాదమనిపేరు. వ్యక్తివాదమునకు నాధారములైన కారణము లెవ్వియన:-

1. ఇండియా, చీనా ఇత్యాది ప్రాగ్దేశములలో ప్రజలకు రాజ్యతంత్రాది విషయములయందు స్వాతంత్ర్యము లేకపోవుటంబట్టి యా దేశము లభివృద్ధినందక నూతనోద్యమములకుంబూనక యెండి మాడి మసియై యుండుట యఖిలజనవేద్యంబ. ఊపిరి యాడకుండునట్లు, ఆచారములచే నావరింపబడినవారి కేగతిగల్గునను విచారమునకు దార్కాణముగ శుష్కశరీరముందాల్చి ప్రాచివారైన ప్రాచీనులు ప్రశాంతులై పరాకు పల్కుచున్నారుగాన, వారిఘోషయైనవిని నేర్చికొనుట కర్తవ్యము.

2. తమతమ శక్తికొలది నార్జన వినియోగములందు ప్రవేశము లేనివారైన నర్థమ్ము లుత్కటములుగ జేయగడగు వారుందురా? నేసంపాదించినదానిని నాయిచ్చవచ్చినట్లు సెలవుజేయు స్వామ్యము నాకుం బాపితిరేని నేనేల యెక్కువ గడింతును? నాకూలివారికి బేరముకొలది సంబళమిత్తును. ఖండితముగా నింత యిచ్చియే తీరవలసినదని శాసించితిరేని నది శాస్త్రరూపమైన కొల్లగాక మఱేమి?

3. ఈ పద్ధతిచే గీడుగలుగుననుటయు నసత్యము. ఎట్లన, యజమానులమైన మేమును నొండొరులతో మత్సరించుటంజేసి వ్యాపారము ననుసరించి కూలిహెచ్చుటయుం గలదు. లాభముగోరిన