పుట:Bhaarata arthashaastramu (1958).pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుద్యమములు జయప్రదములుగా జరుగవలయునన్న భావనాశక్తియు ధైర్య సాహసములును సమగ్రముగా జెందివుండవలయుననట స్పష్టం. ధనమున్నమాత్ర నీగుణములుండుననుట యబద్ధము. కావున ధనశక్తికన్న ధీశక్తి యీనాట బ్రధానము. పశ్చిమఖండీయులెల్లరు జడపదార్థలోలురని కువాదముజేయువారీసంగతి మఱువగూడదు. జడపదార్థలోలురనుట గర్హ్యవాక్యము. అపారమైన మనోవ్యాపారమే యపారమైన వస్తు వ్యాపారమునకు మూలమును నాధారమును. జడములయందు మాత్ర మాసక్తిగొన్నవారు జడులగుటయకాక, జడులెల్లరు జడమ్ములందక్క నింకెద్దాని నాసింప రనుటయు నిశ్చయము. పాశ్చాత్యులు జడు లేనాటికింగారు.

అభిరుచిలేనిచోట్లను దానింగలిగింతురనుటకు నిదర్శనము. మనదేశములో పది పదునైదేడులక్రింద కాఫీ, తేయాకునీళ్ళు శాస్త్ర విరుద్ధములనియు ననారోగ్యకరములనియు ననేకులు నిరసించుచుండుట నేనే చూచియున్నాను. ఇప్పటికిని కుగ్రామములోని పెద్దలు "ఇవి యింగ్లీషువారి దేహములకు మంచివేయైనను మననల్ల యొడలులకు సరిపడవ"ని గట్టిగా వాదించెదరుగదా? ఆదిని ఈ వస్తు వ్యాపారమునకుం బూనినవారు కాలక్రమమునగాని శీఘ్రముగా లాభము రాదను మాట యెఱుగక పోలేదు. అయినను తాత్కాలిక నష్టమునకోర్చి, మనయెదుర నాలుకలలో నీళ్ళూరునట్లు, అన్ని సంవత్సరములుంచి నేడు దానిఫలము ననుభవించుచున్నారు. ఇప్పుడు, ఏటేటకు నీవస్తువులయం దభిమానము పెఱుగుచుండుటచే నెక్కువరాసు లుత్పత్తిచేయబడు చున్నవి. కూటినీళ్ళతో, దృప్తింజెందు నమ్మలు సైతము, ఉదయాన కాఫీలేనిది తలతిరుగుచున్నదని మొఱలిడుట యీ వ్యాపారులకు వీనుల విందుగాదే! ప్రారంభముననే లాభము రాలేదని విసుగుజెంది, "ఈ హిందువులు, అశాస్త్రీయములైన ద్రవములను బహిరంగముగ ద్రాగుదురా" యను శంకచే వెనుకదీసి యుండిరేని మొత్తముమీద