పుట:Bhaarata arthashaastramu (1958).pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొఱతవడినవారై యుందురు. హిందూదేశమున నిప్పుడు ప్రబలముగా నుండు చక్కెర, బూట్సు, సరాయి, కోట్లు, కాలరులు, తోలుమొలపట్టెలు మొదలైన వస్తువుల బేహార మంతయు నీరీతిని బట్టు వడినదేకాని, మనమై ప్రాచీనవిధమనిగాని, స్వతస్సిద్ధ పరమార్థమని కాని యవలంబించినది కాదు. రుచిచూపి మఱపించుట యాధునిక వ్యవహారములలో మిక్కిలియు గణ్యమైన కార్యము.

ఈన్యాయము సుగమమవుటకై యొక నిదర్శనముం జూపెదను. పూర్వము ఋషులు జితేంద్రియ తందాల్చి తపములోనుండగా సర్వధర్మ సంరక్షకుడైన దేవేంద్రుడు తనపదవి కూనమౌనో యను సహజ చాపల్యముచే వారి మనస్సులను తపములను నీఱుగాజేయ నప్సరసలబంపుట సనాతన మర్యాదగదా? దీనివలన దేవేంద్రునకు స్థానభ్రంశమో స్థైర్యమో రెంట నొకటియగుట మీకెల్లరకు విదితమ. సాహస వ్యాపారములన్నింట నిట్లే. పడుటయో లేచుటయో యనివార్యము. అట్లని యూరక కూర్చుంట మాత్రము పొసగదు.

గిరాకి యేకరీతి నుండునదిగాదు. కాలదేశవర్తమానాను గుణముగ క్షయవృద్ధులం గాంచును. అది నదులవంటిది. ఒకప్పుడు దరుల గ్రిక్కిఱిసిపాఱును. వేఱొకప్పుడు శుష్కించి ఇసుక దప్ప మఱేమియు గానరాకుండును. ఉత్పాదకులు గిరాకియొక్క గతుల గమనించు చుండవలయు. లేనిచో తక్కువో యెక్కువో వస్తువులం బుట్టించి తక్కువ చేసినప్పు డల్పలాభమును నెక్కువ చేసినప్పు డమిత నష్టమును గాంతురు.

ప్రపంచమంతయు నేకవ్యవహార చక్రముగ నున్నందున నీగణన లన్నియు నసాధారణ జ్ఞానశోభితులకుం గాని లాతులకు వలనుగాదనుట విశ్రుతము.