పుట:Bhaarata arthashaastramu (1958).pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాముల మించినవారైయుండుటకు సామర్థ్యాతిశయిత తంత్రములేకదా కారణములు?

2. శ్రమవిశ్లేషముచే గర్మకరులు బొత్తుగ స్వాతంత్ర్యము లేనివారగుదురు. ఒక చిల్లరపనిమాత్రమునేర్చి జీవించువారి కాపని యయిపోయిన నేమిగతి? వారు యజమానుల దౌర్జన్యము నెట్లెదిరింప జాలుదురు? ఒక్క వస్తువునంతయు దానే పరిష్కరింపజాలునేని "ఈ క్రూరుని దండనుండుటేల? ఇంకొకయెడకరిగి యా వస్తువులం జేసి పొట్టబోసికొందము" అను ధైర్యమున తమయధీశ్వరులనైన గౌరవమునకుమీఱి రాకుండునట్లు చేయజూతురు. మహాయంత్రములో నొకచిన్న చక్రమట్లు తగులుకొన్నవానికి స్వేచ్ఛా వర్తనంబు సాధ్యమా? తిరుగుమన్న దిరుగవలయు, నిలువుమన్న నిలువవలయు!

ఇందునకుం బ్రత్యాఖ్యానము, నిజమేయైనను నొక్కమఱు మాటయున్నది. ఏదన, కర్మకరు లొకడొకడుగ జూచిన దిక్కులేని పక్షులట్టు లుండువారే యైనను వారెల్లరు సమూహముగ గూడి నియమబద్ధులై యేక వాక్యముగ నేకచర్యగ సలిపిన యజమానుల భయకంపితులం జేయుదురనుట మఱువగూడదు. ఏశ్రమ విశ్లేషము వీరిం బరాధీన వృత్తులంజేసెనో యా శ్రమవిశ్లేషమే వీరిం బ్రోగుగాగూర్చి సంఘీభావమునకు దరుణము నలవరించి సుఖయాత్రకు నావవంటిదాయె విషమును నదియ, విఱుగుడు నదియ! మొత్తమునకు దీనిచే మేలేగాని కీడుగాదు.

3. ఉండనిండు! దేశములోని జనులు వృత్తులచే వేఱుపడుట తగునా! ఒక్కొకరొక్కొకపని మాత్రము సేయువారైరేని, ఎక్కువ తక్కువలు నిత్యములౌను. దానిచే సంయోగము నశించును. ఆర్థిక వర్గములలో నొండొంటికి భేదము లుప్పతిల్లి కలహములకు గారణములై యనర్థకములుగ బరిణ మించును. కావున నొక్కొక్కరు నానావిధ వృత్తులకుం జేరినవారుగా నుండిన నైకమత్యంబారును, తేఱును, అంతటను వ్యాపించును.