పుట:Bhaarata arthashaastramu (1958).pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లూరకపడియుండును. ఇందుచేత వ్రయమేగాని యాదాయములేదు. మఱియు నూరక పెట్టియున్న నుపకరణములు త్రుప్పుపట్టి చెడిపోవును.

6. పనులు బహు లఘువులౌటచే త్వరలో నేర్చికొనవచ్చును. శిక్షకు విశేషకాలము పట్టదు. పూర్వము బాల్యమునందే గురువులయొద్దజేరి యెన్నియో సంవత్సరముల వఱకు క్లేశించి పనినేర్చి కొనుట యావశ్యకముగానుండెను. ఇప్పుడీ శిష్యత్వము త్వరలో గురువునకు తిరుమంత్రము జెప్పునంతటి సమర్థమగును.

శ్రమ విశ్లేషమువలని నష్టములు

1. కర్మకరు లేకరీతినే కీలుబొమ్మలమాదిరి చేతులాడించు చుందురుగాన నయ్యది మనశ్శరీరముల వికాసమునకు భంగకరము. జన్మమంతయు గృషిచేసినందుల కేమిఫలమని యొకడడిగెనేని గుండుసూదిలోని యెనిమిదవయంశమని ప్రత్యుత్తర మిచ్చుటలో నేమి ఘనతయున్నది? మనుష్యులు యంత్రాంగము లట్లుండుట హీన వృత్తియేగదా?

దీనికుత్తరము; 1. నిజమేయైనను, శుద్ధముగ నేనుమాత్రము యోచనలేక దేనినైన జేయగల్గితిమేని త్వరలో నాకార్యమును యంత్రాధీనము జేతురుగాన, హస్తకళలుండు పట్లనెల్ల బుద్ధియు వినియోగము నకు వచ్చుననుట నిక్కువము. కావున జడక్రియలబాధ యాధునిక పద్ధతులవల్ల తగ్గుచున్నదేకాని హెచ్చుచున్నదనుట యిమ్ముగాదు. 2. యంత్రములు, శ్రమవిశ్లేషము, ఇత్యాదుల ప్రాపున నుత్పత్తి విలసిల్లుచున్నందున పూర్వమువలె దీర్ఘకాల మొకేపని జేయుచుండుట యనావశ్యకము. అనగా నెక్కువసేపు విరామముగా నుండవచ్చుననుట. ఇట్లు లబ్ధములైన విరామావసరమ్ములను దేహ మన:పరిశ్రమములచే బూరించి పూర్ణసుఖమేల పడయరాదు? ఐరోపాలో బూర్వముకన్న నిపుడు సేవాజీవులైనవారు చదువు