పుట:Bhaarata arthashaastramu (1958).pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పై వాదము శుద్ధముగ ననాదరణీయము. కారణములు. 1. అందఱు నచ్చుకొట్టినట్టు లేకరీతిగ నున్న సంయోగ మసంభవమగును. భిన్నతయే కూడికకుమూలము. స్త్రీలు స్త్రీలుగను బురుషులు పురుషులుగను నుండబట్టియే కదా అన్నియోగములును వద్దనినను వచ్చిపట్టుకొనుచుండుట! 2. విశ్లేషముచే నొకరికొక రాధారముగా నుండుట తటస్థించును. అందుచే సంఘము ధృఢమైన ఐక్యభావముం గాంచును. వృత్త్యాది విభజనము లేనివారు పిరులులేని త్రాళ్ళువలె నిస్సారులగుదురు. 3. ఇక గలహముల కెడమున్నదనుట యొప్పుకోవలసిన విషయమ. జీవమున్న బోటియుండక మానదు. పోటియొక్క జోలియే వలదనువారు ముక్కుమొగము మూసికొని చావవలసినదే. అట్టివారికింకొక బ్రహ్మదేవుని నగ్నిగుండమునుండిలేపి, ఇంకొక ప్రపంచమును సృష్టించుకొని యక్కడకుంబోయి యేమాత్సర్యమునులేక విజృంభించక సుఖముగా నిద్రపోవచ్చును! ఇందును నొక విశేషము. కారయితృ కార్మికులకు వైరమున్నదంటిమి. ఎందున? ఫలవిభాగమున మాత్రము. ఫలోత్పాదనమున మూలధనము వారు సేవకులును బొత్తుగొని యుండవలసిన వార. అట్లుగానిచో జగడమాడుటకు ఫలమే యుండదు. ఫలము పంచుకొనుటలో విరోధ ముండవచ్చుగాని యా విరోధము సార్వకాలికమును ననివార్యమునని యెంచుట తప్పు. మితికిలొంగిన భేదమేగాని యిది మితిలేని భేదముగాదు. ఎంత పోరాటమున్నను, నారాటము మానునట్లు, ఉపార్జనక్రియల నుమ్మడిగలవారై యుండ వలయుననుట సహేతుకము. మఱియు నప్పటికెన్ని కోపతాపములున్నను సర్వసంగ పరిత్యాగ బుద్ధితో నొకరిమొగము నొకరెన్నడును జూడమని గంటువెట్టుకొనిన నిరుకక్షులవారును నశింతుడు. కాన చిరవైరము వొసగదు. తాత్కాలికముగ జూచిన వియోగమున్నను, దీర్ఘకాలము తీరును గమనించిచూచిన సంయోగమే దృఢతరము. పుంజీదారులయు వేతనజీవులయు బ్రతుకు భార్యాభర్తల