పుట:Bhaarata arthashaastramu (1958).pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యవహార ప్రకరణములకుం జేరినదిగాన నిట బొందింప నవకాశము లేకున్నను, ఒక్కమాటైన జెప్పక విడువరాదు.

ఏకతంత్ర్య వ్యవహార ప్రవర్తన ప్రయోజనములెవ్వి:- సమాత్సర్యంబునకన్న నయమైనట్టివియు స్థిరమై నట్టివియు నగు వెలల నిలుకడ జేయంగల సమర్థత మొదలగునవి. ఈ సమర్థత యున్నదనుట నిజమేగాని యధిపులైన వారాసమర్థత ప్రకారము వర్తింతురనుట యేమినిజము? పోటీలవలని భయములేదు గాన నిచ్చవచ్చిన వెలల నేల నిలువబెట్టి తీయగూడదు? ఉత్పత్తివ్యయము తఱుగుననిరి కదా! ఒప్పుకొంటిమి. వ్యయము తేలికయైన క్రయమును దేలిక కావచ్చును. అవునుగాని "కావచ్చును" అను సంభావనమునకు "అగును" అని స్థిరీకరణ మర్థమని యేమూఢుడు సేయగలడు? ఆవశ్యకవస్తువు లెంత వెలపొడుగైనను మానముపోయిన బోనిమ్మని జనులు బడయం జూచుట స్వాభావికము. ఇట్టివానికెల్ల నెవరికైన నొకరిని సర్వాధి కారింజేసితిమేని, ఉత్పత్తి యెంత విరివిగ సరసముగ జరిగెనేనియు ప్రజకు సుభిక్షము గలుగునని యభయ హస్తమియ్య నెట్లుసాధ్యము? ఒకవేళ 'రాకిపెల్లరు', 'కార్నెగీ', 'మార్గన్‌' మొదలగు వర్తమాన ధనేశులంబోలి యౌదార్యబుద్ధి గలవాడై యుండెబో, భోజనం మిగుల పసందుగా జరిగినను, అయ్యది భిక్షాన్నప్రాయమేగదా! మనకు సర్వవిధముల నతీతుడైనవాని నాశ్రయించి జీవించుటకన్న మరణము మేలు. ఇంచుమించు సరిసములై వారికి మనము, మనకు వారును నూతగానున్న నది జీవనముగాని తక్కినది దాసత్వము. మేతకై యెవడైన మేకవలె వెంబడించియుండుట కొడంబడునా? కావున రాజ్యాంగవిషయములందుంబలె వ్యాపారములందును అనర్గళ ప్రభుత్వం ప్రాణమానంబులకు భయావహము.

చూడుడు! దుష్పరిపాలనము ముత్తెఱంగు, బహు రాజకము, అరాజకము, ఏకరాజకము అని. అరాజకమనగా నేలిక యెవ్వడును