పుట:Bhaarata arthashaastramu (1958).pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పిమ్మట గతిపయవాసరమ్ములలోన రైల్వేకంపెనీ వారు తమ యావద్భృత్య మండలమునకు నూటికింతయని వేతనముల నధికముచేసి, వారి సమ్మతితో ప్రయాణశుల్కముల (అనగా టిక్కట్ల వెలలను) నెక్కువచేసి నష్టముం బూరించుకొనిరి. వారికేమో సంధియు సుఖము నబ్బెగాని యా సెలవంతయు బ్రయాణికుల తలమీదబడి జనసామాన్యముచే శ్రమ మూలధనముల పరిణయమున కియ్యబడు శుల్కమో యనునట్టిదాయె!

విభజనార్థమైన జగడములు, వానిని నివారించుటకై సృజింపబడిన మధ్యస్థసభలు, వీనింగూర్చి చర్చుంచుటకిది తావుగాదు. విభజన కాండమందునకుదగినది. ప్రకృతమున. కారయితృ, కర్తృ, భోక్తృ, సంఘమ్ములకు ఫలవిభాగంబున శత్రుత్వముండుట స్పష్టము. వీరికి శ్వాశ్వతసంశ్రయం బుత్పాదింప నెట్టినియమముల నెవ్వరాదేశింప వలయుననుట యీకాలమ్మున నుద్దండమైనప్రశ్న. ఇయ్యది యనుభవముచే గాలక్రమమ్మున గోచరించు నర్థమ్ముగాని యోగదృష్టి మొదలగు టక్కులకు గ్రాహ్యంబుగాదు.

ఇవన్నియుజూచి కొందఱు జనసామాన్యమునం దనుకంపా సహితులై మాత్సర్యపద్ధతి క్రూరంబని గర్హించెదరు. వీరిమాట నిజమని నమ్మితిమేని, స్పర్ధయన వేఱేమియుగాదు, ముక్కాలు మువ్వీసముమంది నోరుగొట్టి వీసముమందికివేయు నాచారమునకు మర్యాదకునై యీబడిన నామధేయము.

స్పర్ధ తగదనుటతో గొందఱు తృప్తింజెందుదురు. మఱికొందఱంతటబోక, స్పర్ధనురద్దుజేసి యనిరుద్ధరీతి వ్యవహారముల బాలించుట మేలనియు ముట్టనాడెదరు. వీరివాదముల మున్నే వెల్లడించియైనది. ఇందుల కుత్తరపక్షము లేకపోలేదు. అయ్యది విస్తార సముచ్చయ*[1]

  1. * సముచ్చయ = పరస్పరపద్ధతి నవలంబించిన.