పుట:Bhaarata arthashaastramu (1958).pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేకపోవుట. అయ్యది యెంతచెడ్డదని మనవారి కనుభవవేద్యము గాకున్నను, మనపూర్వులు గుడిచిన గోడుగాన నందఱుకును విశ్రుతముగానున్నది. నేటికిని బట్టణములకు గడు దవ్వులనుండు పల్లెలలో దుర్జనులు స్వేచ్ఛగా బీదవారల బీడించుచుంటంజూడ బ్రిటిష్‌వారికి బూర్వము వీరెంత కావరించియుందురో యని యూహింపకుండుటకు గాదు. అరాజకమును బహురాజకమును నన్నదమ్ములవంటివి. ప్రాయశ:తుల్యములే. ఎట్లన; ప్రభుత్వములేనిచో నెల్లరు ప్రభువులేగదా! బహురాజకమునకు దృష్టాంతము పురాణ హిందూదేశము. జమీన్‌దార్లు, పాళెగాండ్రు చాలరని పట్టభద్రులయిన మహారాజులు వందలకొలది బయలుదేఱి గోగ్రహణము, (పశువుల దొంగలించుట) ఇత్యాది దౌర్జన్యములు వీరకర్మములని యెంచునంతహీనులై ధర్మదేవతను దిక్కులుతెలియక సొమ్మసిల్లునట్లు తఱిమి దీనంగావించిరి. ఏకరాజక మనగా నడ్డములేని ప్రభుత్వము. ప్రజలచేతను నితరవిధంబులను మేర మితము, అనుమాటలులేక సర్వస్వతంత్రముగా బరిపాలించుట. ఇందునకు దృష్టాంతములు పూర్వమందేగాదు, ఇప్పుడును నీదేశమునేలు ఘనులు. హైదరాబాద్, మైసూరు, బరోడా, ఇత్యాది సంస్థానాధి పతులును బ్రతిష్ గవర్న్మెంటువారును. ఈ దేశములలోని ప్రజలకేమాత్రము నుత్తరవాదులు కారు. వారిదయచే మనకు గతిగాని మనశక్తి జమాఖర్చులేనియంకె. అనగా నిండుసున్నయనుట! ఈ పరిపాలనము సత్ఫలాతిశయ ప్రతిపాదకమే. శ్రేయోదాయకమే. అయినను, ఏకతంత్రతకన్న జనులకు స్వతంత్రతయుండి, ప్రభువులు ప్రజాప్రతినిధులును సమాధికార సంపన్నులై, పరస్పర సమ్మతిమై బరిపాలనకార్యము నిర్వర్తింతురయేని యంతకన్న మించిన భాగ్యము వేఱొండుగలదా! భూలోకమున మితములేనిది మంచియు జెడ్డ యగును. వానమంచిది. అతివృష్టి యీతిబాధ, నదీప్రవాహమున కొడ్డులులేకున్న వెల్లువలుపాఱి పంటలం బెంటల జేయును, సముద్రం