పుట:Bhaarata arthashaastramu (1958).pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నొకవారమునకన్న నెక్కువ భుక్తిపదార్థము లుండుట యసంభవము. సెలవగుకొలది వారు వస్తువుల రప్పించుకొనువారు. ఇట్టివారికి రైలుబండ్ల పోకలు నిలిచిన నాహారమెట్లు? పొగబండ్లు నిలుచుట, యవిరళములైన సేనావళులచే ముట్టడివేయబడుట, ఇవి రెండును సమానోత్పాతములు. ఏమిచెప్ప వచ్చును? దేశమంతయు ఱిచ్చవడి కంపిత హృదయమై దిక్కు దెలియనిదయ్యె! రైల్వేకంపెనీవారికి గంటగంటకు లక్షలకొలది నష్టము! పనివాండ్రకు గడుపాత్రము సాగకుండుట. ఇట్లు మహాక్షోభంబై యిరుదిక్కుల గ్రుక్కదిరుగనంత యిక్కట్టులైనను వెన్నిచ్చి పాఱుటకన్న చచ్చుటమేలని పట్టుగ నిలిచియుండిరి. అంత నితరులచే బండ్లదోలింప జూచిన వీరికిని పూర్వభృత్యులకును ఘోరమైన పోరుజరిగినందున రక్షకభటసైన్య మడ్డుపడవలసె. "పొట్టేళ్ళ యుద్ధములో నక్కతగులుకొని చచ్చినట్లు" ప్రజకు సరఫరాలు రానందున బహుప్రయాసయాయె. అట్టి యుపద్రవము మాన్పజూడక రాజ్యాంగమువా రూరకుండుట తగునా? గవర్నమెంటువారు ప్రజాసంరక్షణ పోషణమ్ము లనివార్యధర్మంబులని సైనికులంబంపి బండ్లసాగజేయగా పనివారు పూర్వమట్లు రవడించి దురమ్మునకు వచ్చినందున సైనికులు తుపాకులంగాల్చి యనేకులకు గాయములను మరణములను సమకూర్చిరి, మఱియు మడియు కర్మకరులును తమవారేగాన, గవర్నమెంటువారిట్టి ఘోరకార్యమ్ములు దేశమునకే విపత్తుదెచ్చునని దయార్ద్రహృదయులై యిరుకక్షులు నొప్పుకొనదగిన మధ్యస్థసంఘము నిర్మించి, యప్పటికి భండనము చాలించునట్లు చేసి బద్ధసఖ్యత యొడగూర్చు వెరపుల నరయుడని పంచాయతీ దార్ల నియోగించి యప్పటికి శాంతినుద్ధరించిరి. ఈ పంచాయతీలోని సభ్యులెవరనగా గవర్నమెంటు తరపువారు కొందఱు, రైల్వేకంపెనీపక్షము వాడొక్కడు, సేవకుల ప్రతినిధియొక్కడు. చూచితిరా సేవకులు యజమానులతో నుద్దియై చెలంగిరనుటకు నిదర్శనములు!