పుట:Bhaarata arthashaastramu (1958).pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లౌటయుంగలదు. ఎట్లన; ఒకరిని మీఱవలయునని యొక రుద్రేకించి కృషింజేయుటలో తమతమ సరకులసంగతి మున్మున్న భోక్తలకుం దెలియవలయునని వార్తాపత్రికలలోను ఇతర మార్గంబులలోను బ్రకటింతురు. ఇంగ్లాండులో బండముల వర్ణింపుచు చిత్రపటములచే నేత్రాకర్షణముజేయు ప్రకటనలు తయారు చేయుట ప్రత్యేకవృత్తియైనది. ఈ ప్రకటనలకు రైలుస్టేషనుల గోడలమీద నతికించుటయే గాదు, రైలుదారి పొడుగునను సమీపస్థములైన పొలములలో మేకులదింపి వానిమీద విశాలములైన పలకలునిల్పి, ఆ పలకలమీదను బ్రకటనలు రచించి ప్రయాణికులు చూచునట్లుంతురు. ప్రకటన కరులకుబోవు జీతమేమి? పొలము సొంతగాండ్రంజెందు బాడుగలేమి? ఉత్పత్తి వ్యయ మీక్రియలచే హెచ్చుంగాదె! ఇంకను పోటీదారులసంఖ్య యెదుగుకొలది భోగ్యవస్తు సముదాయ మేకస్థితినున్న ప్రతి వ్యవహారియును దక్కువగా నుత్పత్తి జేయవలసిన వాడగును. భాండ నిర్మాణమున కొకయూరికి నొకరిద్దఱు కుమ్మరులైనజాలు. మఱి పదుండ్రు ప్రారంభించిరేని మొదటి మొత్తములో బదిరెండవ భాగమునకన్న నెక్కువ జేయబూనుటయసిద్ధము. రాశితగ్గిన నేమియేని మందలింతురేమో! పరివర్తన కళలలో రాశి యెక్కువ యగుకొలది వ్యయక్రయంబులు తక్కువలగునను న్యాయంబు మఱచితిరా? కావున రాసు లధికసంఖ్యలైన ఏకరాశిగా నున్నపు డున్నంత సుకరముగ నుత్పాదనము జరుగదు. ఏకతంత్ర వ్యాపారములలో సరకుల ప్రమాణముల కుంఠితమౌటచే వ్రయక్రయములు కుంఠితములగును.

ఇత్యాది కారణమ్ములచే స్పర్ధవలన ధరలు క్రిందగుననుట నిక్కంపు దత్త్వంబుగాదు. మఱి యపవాద భూయిష్టంబు.

వెలలు వ్రాలుట యటుండనిండు. పోటీవ్యాపారములలో వెలలు బహు చంచలములు. పడుట, లేచుట, మాయమౌట, గంతులు వేయుట మొదలగు నింద్రజాలములంజూపి వర్తకులను, ఉత్పాదకులను,