పుట:Bhaarata arthashaastramu (1958).pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మునకన్న మితిమీఱి యుత్పత్తి యార్జనకువచ్చిన వస్తువులమ్మ బడక నిలిచి కుళ్ళి కంపెత్తి వ్యర్థములగును. అమితోత్పాదనము స్పర్థచే జనించు కొఱగాములలో ప్రప్రథమము ఏరీతినందురో? ఆయూరిలో కుండలకు గిరాకివచ్చినదని ప్రతివాడును ఆ గిరాకిని దానే పూర్తించి లాభపూర్ణుడు గావలయునని యువ్విళ్ళూరుచు చట్లు తట్టుటకుం బూనిన, గిరాకికిమించిన సరఫరా సిద్ధించు. ఇందుచే వెలలుతగ్గి, యది కారణముగ గిరాకిహెచ్చెనేనియు నాతర్వాతను శేషించిన మృత్పాత్రములు వ్యర్థములనుట కేమిసందేహము? మితిమీఱిన స్పర్ధచే మితిమీఱిన యుత్పత్తికలిగి తద్ద్వారా మూలధనము, శ్రమ ఇత్యాది కర్మసాధనంబులను మోఘంబులంజేసి సంఘంబున కపకృతిం జేయును. ఐరోపా, అమెరికా, ఇత్యాదిదేశములలో నధికకోత్పత్తిచే వెలలు కృశించి నిలుకడలేనివై యపుడపుడు మహోత్పాతములం గల్పించి వ్యవహారములగల గుండువడం జేయుట నికముందు విశదీకరించెదము.

3. స్పర్ధచే వెలలుతఱుగును. వస్తువులు నయములౌను. కావున బీదలకును గర్మకరులకును నత్యంతోపకారి, ఎట్లన; వ్యవహారమంతయు నొకని యధీనమందున్న, వాడు పెట్టినది భిక్షము. అందును ప్రాణాధారవస్తువులైన ధాన్యాదులు మానరక్షకమ్ములగు వస్త్రములకు వలయు ప్రత్తి మొదలైనవాని యుత్పత్తికి కొందఱీశ్వరులై కట్టుగట్టి కొని నిలిచిన, వీనియందలి యాదర మనశ్వరముగాన వస్తువునుజూచి కాక మనశక్తినిజూచి వెలలువిధించినను గూడినంత నిచ్చుట కోర్చుట దప్ప వేఱుదిక్కు వెదకినం దొరకదు. అనేకులీ సరకులకు నాథులై రేని పరస్పర మాత్సర్యంబునంజేసి తమతమకు వాడుక కాండ్రెక్కువ రావలయు ననుకోరిక నొండొరులంగడవ వెలలు సరసములుగ జేతురు గాన బ్రజకు ప్రకృష్టబగుట స్పష్టంబు.

ఆక్షేపణ. ఇది కొంతవఱకు నిజమైన న్యాయంబైనను అపవాదములు లేనిదికాదు. సమయాంతరముల ధరలు స్పర్ధచే నున్నతము