పుట:Bhaarata arthashaastramu (1958).pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భోగులను వెగడుపఱచి వేసరించును. ఎట్లన; స్పర్ధాళువులలో ప్రతివారును పేరాసచే అమ్మకమంతయు దమచేతికేరావలయునని ఎక్కువ సృజించిరేని మితిమీఱిన ఉత్పత్తిజనించి వెలలకు భంగమును ఆసాములకు నష్టమును గలిగించును. ఈ నష్టముచే దివాలెత్తినవారు దివాలెత్తగా, నిలిచినవారును దిగులుచెంది ఇకముందెట్లోయని కడు గొంచెము ప్రోగుచేసి యెదురుచూచుచుండుతఱికి, గిరాకి ఈతబ్బిబ్బులకు నాస్పదముగాదు గాన మునుపంత ముమ్మరికము గలదియగుట వెలలు తటుక్కున విజృంభించు సముద్రములోని తరంగములంబలె ధరలు పెఱుగుచు, తఱుగుచు, లేచుచు, నడంగుచుండుట వ్యవహారములకు శ్రేయంబుగాదు. నేడావశ్యకవస్తువులు సరసములాయెగా యని నమ్మి యితరపదార్థములమీద వెచ్చించువాడు, ఱేపని ప్రియములగుడునప్పులపాలగును. ధరలు, ఆర్థికరథమ్మునకు నశ్వములు. ఎటుబోయినను నపాయములేదుగాని, మెల్లగా క్రమముగ గతి మాంద్యమో వేగమో యాశ్రయింపవలయు ననుట యగత్యము. అట్లుగాక యున్నట్టుండి పఱువువాఱుటో, హథాత్తుగ నిలుచుటయో, తటాలున దిరుగుటయో, యకస్మాత్తుగ ముంగాళ్ళు మీదికెత్తి దుముకుటయో, ఇట్టి వినోదములకుం గడంగిన బండిలోనున్న కుండలేనా తలలుగూడ నెఱ్ఱెలు విడుచును. నిర్మాత్సర్యవ్యవహారముల ధరల గమనము, ఒకపద్ధతి ననుసరించి దేహము లసియాడని విధంబునం బోవును.

4. నిరాతంక స్పర్ధచే వృత్తులు సమాన లాభకరంబులౌను. ఎట్లన నెందేని నమితసంపాదనమున్న నితరులందు బ్రవేశించి యమితమును మితముంజేయుదురు. సంపాదనముతగ్గినచో దానినివిడిచి మేలైన శిల్పములకుంబూని బాగువడుదురు. లాభముతో బోటాపోటీయు హెచ్చి ప్రాప్తింగుదించి సమత్వస్థాపనం బొనరించుటయు, నష్టమున్న బోటి లఘువై ప్రాప్తినెగజనంద్రోయుటయు, నను నీసాధనద్వితయం