పుట:Bhaarata arthashaastramu (1958).pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రస్తావవశమ్మున ననుకొన్నంతకన్న నెక్కువచెప్పితిమి. ఇక ముందీవిషయము మఱల నందు కొందుము.

ఆవేశనవృత్తియం దెటుతిరిగినను కర్మకరులు యజమాన ప్రభావముచే నావృతులై యుందురు. "ముల్లును దీయవలయునన్న ముల్లేకావలయు" నన్నట్లు ఈకీడున కావేశనవృత్తియే చికిత్స. ఎట్లన;

1. పరాధీనులైన శిల్పకారులకు నాథవంతులుగనుండని యప్పటికన్న నిప్పుడు భరణము రూఢియు నాఢ్యమైనదిగాన మొత్తం మీద క్లేశభాజనమైన దారిద్ర్యతాప ముపశమించును. దారిద్ర్యతాప మారెనేని ఉత్సాహాభిమానములును, వన్నెయు వాసియుం గనవలయునను శౌర్యము మొలకలెత్తి పురణించును.

2. మఱియు సేవకులైనవారు దినదినమును గలసి మెలసి మెలంగువారుగాన, ననతికాలమ్మున దామేకీభవించి సంఘములుగా సమయబంధ ప్రవర్తకులై నిలిచినచో, యజమానులతో సమానులై బేరమాడి జీతము మొదలయిన కర్మనిధుల ననుకూలములుగ జేయ వచ్చునను నుపాయము గుఱ్తెఱుంగుదురు. ప్రతివాడును యజమానుల యెడ పుల్లవలె నిస్సారుడైనను అందఱుం బ్రోగుగాజేరిన గట్టెల మోపురీతిని విఱుచుటకు నసాధ్యులౌదురు. వర్తమానమున నాగర కాగ్రేసరములైన ఇంగ్లాండు, జర్మనీ, ఫ్రాన్‌స్ దేశముల శిల్పశ్రేణులు బలాఢ్యములై యనర్గళ ప్రచారములై జనబాహుళ్య నిశ్రేయసోదాత్తములై యున్నవి. ఇట్టివమెరికాలోనున్నవి గాని యింకను బ్రౌఢములుగాలేవు. కారణమేమనగా - ఆదేశము బహువిస్తారమును, అమిత ఫలవంతమును కాన బీదతనము ప్రజలయెడ నింకను జుట్టుముట్టనందున తన్నివారణ మనావశ్యకమాయె. ఈ కారణము మనయిండియాలో వ్యతిరిక్తమయినను యీ శ్రేణు లింకను నిచట సృష్టికిరాలేదు. ఎట్లన:- జాతిభేదములచే నైకమత్యము, నిఱుపేదతనముచే యజమానుల నెదిర్చి నిలుతమను ధైర్యము, శక్తియు నిచట పేరునకైన