పుట:Bhaarata arthashaastramu (1958).pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేకున్న యవి. యజమానులు కూలివారికై పరస్పరము స్పర్థించుటచే గాక ప్రజల స్వప్రయత్నముచే వేతనము లుత్కటములగుట యిచట నిప్పటి కసంభావ్యమే.

అనాగరకదశల వసితంబులైన కాలంబుల విపులంబులై యుండి కాలక్రమమున వినష్టములై, తదనంతరము మఱియుం గాలంబు పరిణమించి మార్పులం బొందించుతఱికి శిల్పశ్రేణులెట్లు పునరవతార మహిమందాల్చి యాశ్చర్యావహ దీప్తిమంతంబులై యున్నవో యీ యద్భుతముం గమనించితిరా! ఐకమత్యం బనర్గళంబగునేని పౌరుషం బెన్నిభంగుల నెన్నిరూపులందాల్చి వికసింపదు? ఐకమత్యం రాష్ట్రమునకు వేఱువంటిది. అదితెగక పదిలంబుగనుండిన కాలవశమున నాకులు కొమ్మలునెండి క్రిందబడినను క్రొత్తక్రొత్త చిగురులు, శాఖలు, పొడమి నేత్రహృదయానందంబుగా నుండునుగాదె! ఐక్యమత్యములేనిచో మంత్ర తంత్రంబులు, వరుణజపంబులు. పౌరాణిక దోహదములు, నిరర్ఠకములును బరిహాస పాత్రములును నగును.

మఱియు నొకవింత, కర్మశాలలో పనిచేయువారికి నారోగ్య ప్రాణరక్షణార్థమై గవర్నమెంటువారు ప్రతిశాలను మంచిగాలి మొదలగునవి విశేషించి వచ్చునట్లు కట్టింపవలయుననియు, లేబ్రాయము వారిని, తరుణవయస్కులను, ఇన్నిగంటలకంటె నెక్కువ పనిచేయించ గూడదనియు, దిన మధ్యమున భోజనవిరామములకై యొకగంట సెలవియ్యవలయుననియు నిట్లనేకవిధంబుల నియమముల విధించివున్నారు గాన, ఈ నిబంధనలనన్నియు ననుసరించిన సెలవులు పెఱిగి యచ్చికములు తఱుగునను తలంపుచే, నీచులైన యజమానులు, దారిద్ర్య పీడితులై యెట్టికఠిన కార్యములకును మాఱు పల్కలేని కొందఱ నిఱుపేదలను తక్కువకూలికి వారివారి యిండ్లనే పనులజేసి తెచ్చి యియ్య వలయునని నిర్బంధించుటంజేసి, ఈ నికృష్టమార్గమ్మున నివేశవృత్తులు పునరావిర్భూతములయ్యె! ఈవృత్తులవలె నిర్దయాత్మకములును దు:ఖ