పుట:Bhaarata arthashaastramu (1958).pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెంటనే కోయుటకుగాదు. ఇట్లు క్రియలు సంయుక్తములుగాక భిన్నకాలములై యుండుట యనర్గళ వ్యాపారమునకు నర్గళము. అట్లగుట శ్రమవిశ్లేషణ మప్రధానంబు. ఎట్లనిన:- దుక్కిచేసినవాడే విత్తుట, కోయుట, కలుపుదీయుట మొదలగు క్రియల జేయవచ్చును. అని కాలాంతరకృత్యములు యంత్రశాలలో నేకకాలక్రియలు సంభవిల్లుం గాన విభజనములేనిది వేయిచేతుల కార్తవీర్యుండైన కరణీయంబు లెల్లం దీర్పజాలడు.

మఱియు విభజనగుణమ్ముల కళలలోనే యంత్రములకు ప్రవేశమధికము. ఎట్లన:- విభజన మెక్కువయగుకొలది ప్రతికార్యము నేకవిధమైన చలనశక్తిచే సరళముగా జేయబడునదియవును. దూది శాలలో ప్రతియంగమును నియతమైన యొక్కతీరునం దిరిగినజాలు. మనచేతులట్లు వంకర, నేరు, వర్తులము ఇట్లనేకములైనగతుల మిశ్రపఱచుట వానిశక్తికిమించినపని. సాధారణముగ మనుష్యులు సేయు క్రియలెల్ల నానావిధక్రియలచే బరిష్కృతములు విభజనమనగా నొక్కరే యనేకవిధక్రియలజేయక, యేకవిధముగ నాచరించుట. ఏకగతిచే సాధ్యములైనయవిచేయ బుద్ధిబల మగత్యముగాదు. ఇట్టి పనులకు యంత్రములేచాలును. ఘటికాయంత్రము (అనగా కపెలను) అందఱును జూచియున్నారు గదా! అందు బ్రతిభాగము నేకవిధమైన సంచారముగలయదికాని మనయట్లు పలుపోకల బోవునది గాదు. కావున విశ్లేషణయంత్రశక్తు లన్యోన్యానుగతంబులు.

చూడుడు హీనవృద్ధి న్యాయబాధితములైన యుద్యోగముల యందు యంత్రసహాయమల్పమని పూర్వమే స్ఫుటపఱచితిమి. "తగిలిన కాలే తగులును" అన్నట్లు శ్రమవిశ్లేషణ సహాయమును ఇందు ఘనము గాదు. అధికవృద్ధి కాశ్రయములైన వ్యాపారములందు యంత్రములు, ప్రయాసవిశ్లేషణమువలని సమర్థతయు నరనారాయణులబలె నేకీభవించి తోడుపడును.