పుట:Bhaarata arthashaastramu (1958).pdf/290

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ ప్రకరణము

వృత్తుల పరిణామము - ఇతర పద్ధతులు - శ్రేణిపద్ధతి

గ్రామపద్ధతి కానంతరికమయ్యు నద్దానితో బిరిగొని భేదమేర్పఱచుటకుం గష్టమైన శ్రేణిపద్ధతి యనునదొకటిగలదు. శ్రేణియనగా నేకవృత్తులయిన శిల్పులు స్వరక్షణ లాభమ్ములకై సమయకల్పనలతో నిర్మించుకొనిన సంఘము ఇట్టివి యూరోపుదేశమందువలె హిందూదేశ మందంత ఖ్యాతికిరాలేదు. ఎందులకన; మనలో కర్మలు జాతులలో నుపగతములై వర్ణములుగ మాఱినవి. మంగలి, చాకలి, కమ్మరి, గొల్లడు, ఇత్యాద్యసంఖ్య కులభేదములు వృత్తి వ్యత్యాసా విర్భూతములనుటకు సందేహము లేదు. కావున శిల్పశ్రేణులకు బ్రత్యేకజీవనము లేకపోయె. శిల్పములు జాతులలో నావేశించినవగుట వ్యవహార కులధర్మములు ఐక్యముంజెందె. ఈ పావనభూమి గాలిసోకినంజాలు. అన్నియు జాతులౌను! వర్తమానమున జాతిభేదము లనుచితములని వాదించు కొందరు నిర్భేదజాతియను నొక నూతనజాతిగా నేర్పడునట్లు తోచుచున్నది! పెక్కుమొగములుగజీలి ప్రవహించు గంగానదిబోలె నామెను గొలుచు మనమును ఖండఖండములుగా వేఱైయుండుట యేమి చోద్యము? మనగతి తెల్లబాఱినది. దానిమాటయేల? యూరోపులో వ్యావహారిక సార్థములు భిన్నజాతులుగాలేదు.

శ్రేణుల ముఖ్యలక్షణములు

కూలివారివలెంగాక శ్రైణికులు ఉపకరణములు, కచ్చా సామగ్రులు మొదలగు సాధనకలాపమునకు దామే సొంతగాండ్రై యుండియు, గ్రామ్యపద్ధతియందుంబలె మితవ్యాపారకాలము గావున నుత్తరువులంబొందియే సరకుల దయారుసేయువారై యుండిరి. కూలివారికిని శిల్పులకును భేదమేమన్న, కూలివారు పొలములో బని