Jump to content

పుట:Bhaarata arthashaastramu (1958).pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రామ్యపద్ధతి జడపద్ధతి. వికాస విన్యాసములకు వీలులేదు. ఎట్లన; నవీన కాంక్షలుండెబో, తత్పరిహారకములగు వస్తుపుంజంబులుండుట దుర్లభము. దుర్లభములును నదృష్టములు నగోచరములు నైన వానియెడ మరులుగొని పలవరించి ప్రయత్నించుట మనుష్యులకు నసహజం. మఱియు వాంఛ లుత్కటములుగావేని ఉద్యోగములు విజృంభింపవు. ఈ కారణములచే వస్తువులు లేమి వాంఛలు, వాంఛలు లేమి నుపార్జనములును సన్నబడి జనుల నభివృద్ధి నందనీక నికృష్టస్థితి పాత్రులం జేయును. విధిలేక మితమనోరధులై యుండువారికి వేదాంతము బయలుదేరి "మితస్పృహులై యుండుడీ" యని యప్రయోజ కోపన్యాసముం జేయుటజూడ నెవ్వరికి నవ్వురాదు? తిండిలేక చచ్చు వారికి, ఉపవాసవ్రత మాదేశించినట్లు.