పుట:Bhaarata arthashaastramu (1958).pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాయమువారిని పనులకుం గుదుర్తురు. ఈ దురుద్యోగములకు మూలములు రెండు. తక్కువ సంబళమునకు వత్తురని యజమాను లాసగొనుటయు, కుటుంబమునకై యేమాత్రమైన గడించిన నూరక దండుగ తిండి తినియుంటకన్న మేలుగదాయని తలిదండ్రులు పేరాసగొనుటయు. శుభ్రమైన గాలియు తఱుచు విరతియులేని కెలసములలో లేబ్రాయపు గొమరులం బ్రవేశింపజేసిన, అప్పటికి వరుమానము గలిగినను పెఱుగుటకు భంగమై దేహముచెడి కృశించిన వారౌదురు గాన ముందఱికి ముప్పుతప్పదు. కొమరుంబ్రాయపువారు కందినం దత్సంతతియు బడుగువడుగాన దొరతనమువారు అతిబాల్యశ్రమను గుఱించి తద్దోషావదారణార్థము శాసనములం జేసియున్నారు. ఇటు చేయుట తగినదైనను గవర్నమెంటువారు నిక్కపు టుపకారబుద్ధితో గాక మనకు వ్యవహారముల నెదిరినవారైన ఇంగ్లీషు వ్యాపారులకు సహాయము జేయవలయునను అభిలాషతో విధించిన నియమములనియు, ఇన్నికట్టుబాటులకు బాల్పఱిచిన బరరాష్ట్రీయులతో మత్సరించి వారికన్న నధికము సులభముగ వస్తువుల నమ్మునంత నయముగ సరకులం బరిష్కృతములు చేయలేమనియు మనలో గళాగ్రేసరులు కొందఱు వాదించిరి. గవర్నమెంటువారి మనసు పరిశోధించునంత వాడిచూపులు నాకులేవు. మనసెట్లున్ననేమి? శాసనము ప్రశస్తమనుటకు జంకులేదు. మఱియు గొందఱు "గర్భిణీస్త్రీలను, ఆఱేండ్ల బాలికాబాలకులను గనులలో సైతము పనికి దింపుట కొన్నితరముల క్రిందట ఐరోపాలో బీదలలో సామాన్యముగ నుండెగాన "పశ్చిమ ఖండీయులు ఎట్టికఠినాత్ములు! కాంచనమునకై భార్యాపుత్రులం బలియిచ్చు పాపచిత్తులు" అని కేరడించి వాపోయెదరు. ఇది గురిగింజ సామెత. అతిబాల్యవివాహమునకన్న నతిబాల్యకర్మకరత ఎక్కువ హాని జేయునదికాదు. మఱియు నైరోపావారు ఎన్నడో తమ లోపములను సవరించుకొనిరి. ఏసవరణలును లేనిమనము ఒరులజూచి