పుట:Bhaarata arthashaastramu (1958).pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాడుక. ఈకారణముల నన్నింటిని మఱల జర్చించుట యనావశ్యకముగాన నప్రసంగతములైన రెంటినిమాత్రము పేర్కొనెదము.

1. ఉంఛవృత్తి. ఆర్జించినవారి బీడించిబ్రదుకుట సగౌరవ జీవనోపాయములలో నొకటిగా మనదేశమున నెలకొనియున్నది. ఇందుచే గష్టించక ఫలము గొనవలయునను దురాశవర్ధిల్లి మోసపు మార్గముల గడించుటయను నాచారమును ఉత్పాదించినది. "ఫలము లభించినంజాలు, పద్ధతులెట్లున్ననేమి?" అను దురాలోచన అంతటను నిండియుండుటంజూడ ఫలాపేక్షారహిత కర్మముంబోధించు భగవద్గీతలకు వచ్చిన అనుభవ గ్రహచారమేమోయని తట్టకమానదు. ఇంగ్లాండులో భైక్ష్యము నీచమని యెవరును దానిచెంతకుంబోరు. కష్టించక కూలిగొనుట భిక్షమేకదా అను లజ్జచే విచారణకర్తలు లేకున్నను ఒప్పుకొన్నంత చేయజూతురు! కావున నది మేస్త్రీలు, సూపర్‌వైజర్‌లు, ఇన్‌స్పెక్టర్లు మొదలగు నిరర్ధక శ్రమకరులు బలిసి క్రిక్కిరిసిన దేశముగాదు.

2. అవిభక్త కుటుంబములు. వీనిలో మంచిగుణములు లేక పోలేదు. అయినను ఎవడైన నొకడు సంపాదనపరుడుండిన వాని న్నమ్మి అనేకులు ఎదిగినవారుండుట సోమరితనమునకు బహుమాన మిచ్చినట్లు. స్వార్జిత ముత్తమము; అన్యము లధమములు అను గరువపుదిరస్కారబుద్ధి లేనిదేశములో మానము నర్థము రెండును మెండుగావు. మానములేనిది గౌరవమడంగును. గౌరవముమీద దృష్టిలేనిది మగతనముం జూపుదమను తెగువదొరకొనదు. కాళ్ళుపట్టుకొని బ్రతుకుటయ అశ్రమమని విక్రమములకు మొదలిడరు. మానరక్షణమున కెవ్వికారణంబులో ఆ గుణంబుల అర్థాభివృద్ధికి నాద్యంబులు. ధర్మార్థము లెడతెగనివి.

ఫ్యాక్టొరీ చట్టములు

పూర్వమునవలెగాక ఇపుడు స్పర్ధ మిక్కుటము గావున ఒకరికైన నొకరు తక్కువకు నుప్పతిల్లజేసి యమ్ముకొఱకు అతిబాల్య